తెలంగాణలో లాక్ డౌన్‌ను పూర్తిగా ఎత్తేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు పూర్తిగా తగ్గడ, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించారు. కరోనా పూర్తి నియంత్రణలోకి వచ్చిందని సీఎం కేసీఆర్. వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికలను పరిశీలించిన కేబినెట్.. ఈ మేరకు లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.