బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్ ఈ రేసులో తనను తాను అండర్డాగ్గా అభివర్ణించుకున్నారు.
కన్సర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుదిపోరులో నిలిచినా రిషి సునాక్ కు ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఊహించిన మద్దతు లభించడం లేదు. తనతో పోటీపడుతున్న వ్యక్తికి పట్టాభిషేకం జరగాలని కొందరు కోరుకుంటున్నారని, కానీ నిర్ణయం టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యుల చేతుల్లో ఉంటుందని చెప్పారు. ఎవర్ని గెలిపించాలో నిర్ణయించుకునేందుకు వారికి ఇంకా చాలా సమయం ఉందని రిషి అన్నారు. రిషిపై ట్రస్ 24 శాతం పాయింట్ల లీడ్లో ఉన్నట్లు బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ యూగో సర్వే అంచనా వేసింది. మొత్తం 730 మంది కన్సర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా అందులో 62% లిజ్ ట్రస్ ను బలపరిచగా, మిగతా 38% రిషి సునాక్ కు మద్దతిచ్చారు. సెంట్రల్ ఇంగ్లండ్ గ్రాంథమ్లో శనివారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన దీనిపై స్పందించారు, పరోక్షంగా స్పందిస్తూ తాను అండర్డాగ్నని చెప్పారు రిషి. ఈసారి జరిగే తుదిపోరులో 1,60,000 మంది బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఇందులో ఎక్కువ ఓట్లు ఎవరికీ వస్తే వారే బ్రిటన్ ప్రధాని పీఠం అధిరోహిస్తారు.