హిండెన్‌బర్గ్ పై న్యాయ పోరాటానికి అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. గొప్ప పేరున్న న్యాయవాద సంస్థల్లో ఒకటైన వాచ్‌టెల్ ను నియమించుకుంది. న్యూయార్క్‌లో ఉన్న ఈ న్యాయవాద సంస్థకు కార్పొరేట్ చట్టాలు, భారీ, సంక్లిష్ట లావాదేవీల నిర్వహణలో పట్టుంది. ఆ సంస్థలోని అనుభవజ్ఞులైన న్యాయవాదులు లిప్టన్, రోజెన్, కట్జ్‌లను ఆదానీ ఎంపిక చేసుకుంది. అదానీ గ్రూప్ కంపెనీలు స్టాక్ మానిపులేషన్, మోసాలకు పాల్పడుతున్నట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతోఅదానీ గ్రూప్ షేర్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. హిండెన్ బర్గ్ ఏమాత్రం నైతికత విలువలు లేని షార్ట్ సెల్లర్ అని ఆదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. అయితే ప్రస్తుతం పెట్టుబడిదారుల్లో భరోసాను నింపడంపై దృష్టి పెట్టిన ఆదానీ… తన వ్యాపార సామ్రాజ్యం బలమైన పునాదులపై నిర్మితమైందని, ఎటువంటి ఆర్థిక నష్టభయాలు లేవని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో న్యాయపోరాటానికీ సిద్ధమైనట్టు సమాచారం.