ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వేదికగా మహా కుంభమేళా ప్రారంభం అయింది. దాదాపు 144 సంవత్సరాలకు ఒకసారి మహా కుంభమేళా జరుగుతుందని చెబుతున్నారు. ఇంతటి అరుదైన ఘట్టం కాబట్టి సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. దీని వల్ల ప్రభుత్వానికి విపరీతంగా ఖర్చు అవుతుందని, ప్రజల సొమ్ముని మంచి నీళ్లలా ఖర్చు పెట్టేస్తున్నారని కుహానా మేధావులు, సెక్యులరిస్టులు గోల పెట్టేస్తున్నారు. సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున బురద చల్లేస్తున్నారు.
….
కానీ వాస్తవాలు గమనిస్తే చాలా విషయాలు అర్థం అవుతాయి. ఈ మహా కుంభమేళాతో అక్షరాలా భారతీయ సమాజానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల మేర సంపదను సమకూరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించిన లెక్కలను కూడా స్పష్టంగా చూపిస్తున్నారు. ఇప్పటికే భక్తుల రాక, కార్యక్రమాలు, ఘట్టాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ వివరాల ఆధారంగా ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు.
….
మొత్తంగా ఈ నెలన్నర రోజుల్లోనూ సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనా. ఇందుకోసం ప్రముఖ పుణ్యక్షేత్రం ప్రయాగ్రాజ్లో 4వేల హెక్టార్లలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. భక్తులకు వసతి, రవాణా సౌకర్యాలు, పారిశుధ్య వసతులు కల్పిస్తున్నారు. యాత్రికులు సులభంగా పుణ్యస్నానాలు చేసేట్లుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
….
40కోట్ల మంది భక్తుల్లో ఒక్కొక్కరు రూ.5వేల ఖర్చు చేస్తే ఉత్తర్ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కో భక్తుడి సగటు ఖర్చు 10వేలకు కూడా చేరే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా రూ.4 లక్షల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. అక్కడకు వచ్చిన యాత్రికులు ప్రయాణాలు, వసతులు, ఆరోగ్యం, షాపింగ్ ల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. దీంతో ఉత్తర ప్రదేశ్ సమాజానికి ఎంతో మేలు కలుగుతుంది.
….
(( Graphics Start ))
హోటళ్లు, గెస్ట్ హౌస్లు, తాత్కాలిక లాడ్జీల ద్వారా రూ.40వేల కోట్ల వ్యాపారం జరగనుందని అంచనా. ఆహారం, పానియాల రంగం నుంచి రూ.20వేల కోట్లను సమకూర్చే అవకాశం ఉంది. పూజా సామగ్రి సహా ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా రూ.20వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయి. రవాణా, లాజిస్టిక్స్ సేవలు ద్వారా రూ.10వేల కోట్లు రావచ్చును. టూరిస్ట్ గైడ్లు, ట్రావెల్ ప్యాకేజీల ద్వారా మరో రూ.10వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధాల ద్వారా మరో రూ.3వేల కోట్లు, రావచ్చును. ప్రకటనలు, ప్రమోషన్ కార్యకలాపాల ద్వారా రూ.10 వేల కోట్ల వ్యాపారం జరగవచ్చు.
(( Graphics End ))
…….
ప్రయాగ్రాజ్లో 2019లో జరిగిన అర్ధకుంభమేళా కు 24 కోట్ల మంది యాత్రికులు వచ్చారు. దీని ద్వారా ఉత్తర్ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రూ.1.20 లక్షల కోట్లు సమకూరాయి. ఇది స్పష్టంగా రుజువైన వాస్తవం. దీనిని బట్టి ఈ సారి 40 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనా ఉండటంతో ఈసారి రూ.2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని చెప్పారు. మొత్తం మీద హైందవ సంస్క్రతి, సంప్రదాయాలతో భారతీయ సమాజానికి ఎప్పుడూ ప్రయోజనమే తప్ప నష్టం లేదని అర్థం చేసుకోవాలి.