ఆఫ్గనిస్తాన్ లో తాలిబాన్ అధికారం చేజిక్కుకుంది అని ఒక వైపు సగటు భారతీయులు టెన్షన్ పడుతుంటే, ఈ తాలిబాన్ ప్రభుత్వం అక్కడ ఏర్పడి నందుకు కొందరు సిగ్గు విడిచి బాహాటంగా అనందపడుతూ వుంటే బహుశా మరికొందరు అంటే గత యుపిఏ ప్రభుత్వం లోని ఉన్నత మంత్రి పదవులు వెలగబెట్టిన కొందరు, ఉదారవాద మేధావులు లోలోపల అమిత అనందపడుతూ వుంటారు.
కారణం మోడీ ఫాసిస్టు ప్రభుత్వాన్ని కూలదోసి తమకు ఏ విధంగానూ ఇబ్బంది పెట్టని చక్కిటి సెక్యులర్ కలగూర ప్రభుత్వం రావడానికి నిన్నటి వరకు ఈ ముఠాకు నైతిక మద్దతు ఇస్తున్న చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల లిస్ట్ కు నేడు ఆఫ్గనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా కలుస్తుంది అని. ఆ తాలిబాన్ భారత్ కు అంటే మోడీ ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు సృష్టిస్తే ఈ సెక్యులర్ ముఠాకు అంత ఆనందం.
సరే ఈ తాలిబాన్ కి యుపిఏ కు లింక్ ఏమిటి? వాళ్ళతో యుపిఏ నాయకులకు అంత మంచి సంబంధాలు వున్నాయా ?
అయితే ఇది చదవండి..
తెహల్కా పేరు వినని వారు బహుశా దేశంలో ఉండరేమో. ఇది ఒక పరిశోధనాత్మక వార్తలు ప్రచురించే వెబ్ పోర్టల్. 2001లో వాజ్ పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది తన విలేకరులను ఒక డమ్మీ డిఫెన్స్ కాంట్రాక్టర్లగా అప్పటి బిజేపి అధ్యక్షుడు లేట్ బంగారు లక్ష్మణ్ దగ్గరకు పంపి ఆ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది కి సాయం చేయమని పార్టీ ఫండ్ గా ఒక లక్ష రూపాయలు ఆయన తీసుకుంటున్నట్లు సీక్రెట్ గా వీడియో తీసి బయట పెట్టారు. దాని మీద పెద్ద దుమారం చెలరేగడం లక్ష్మణ్ గారు రాజీనామా చేయడం,11 సం.లు కేసు విచారణ జరిగి ఆయన 72 సం.ల వయసులో తీహార్ జైలుకు వెళ్లడం జరిగింది. ఒక లక్ష రూపాయలు ఆయన రాజకీయ జీవితాన్ని సమాధి చేసింది.
ఈ తెహల్కా అవినీతిపై యుధ్ధం చేస్తోంది అని అందరూ తెగ పొగిడారు. అయితే అసలు విషయం ఇది కాంగ్రెస్, ఉదార వాద సెక్యులర్ ముఠా లో ఒక సభ్యుడు. అంతే. ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఈ ముఠా తరుచుగా దాడులు చేస్తున్నట్లే అప్పుడు వాజ్ పెయి ప్రభుత్వాన్ని ఈ ముఠా సభ్యులు ఏదో విధంగా ఇలా తరచుగా ఇరుకున పెట్టడానికి ప్రయత్నించే వారు. నిజంగా ఈ తెహల్కా అవినీతి మీద యుద్దమే చేస్తే వేల కోట్లు అవినీతి ఆరోపణలు వచ్చిన యుపిఏ ప్రభుత్వం ఉన్న పది సం.లు యే యుపిఏ రాజకీయ నాయకుడు మీద ఇటువంటి స్టింగ్ ఆపరేషన్ నిర్వహించలేదు. దానిని బట్టి ఈ తెహల్కా నిజాయితీ మనం వూహించవచ్చు.

ఇందువల్లనే దీనికి కర్మ కొట్టింది. దీని పెద్ద తరుణ్ తేజపాల్ తన సహచర ఉద్యోగిని లైంగికంగా వేధించాడు అన్న ఆరోపణలతో పరువు పోగొట్టుకున్నాడు. కానీ ఈ యుపిఏ ముఠా ఈ తేజ్పాల్ ని వెనకేసుకు వచ్చింది. అది ఈ మాఫియా ముఠా సభ్యుల మధ్య వుండే బంధం. కష్టాలు వచ్చినపుడు తమ సెలబ్ లాయర్లు సిబల్, మను సింఘ్వీ మొదలగు లాయర్ల ద్వారా ఒకరినొకరు డిఫెండ్ చేస్తారు, రక్షిస్తారు. అందుకే ఈ తేజ్ పాల్ వంటి వారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న దానికి మద్దతు ఇస్తారు.
సరే! ఇది పక్కన పెడితే..యుపిఏ ప్రభత్వం ఉన్న 10 సం.లు ఈ తేజ్ పాల్ వంటి వారికి పండగే పండగ. వీరికి అనుకూల ప్రభుత్వం వుండడంతో ఒక వెలుగు వెలిగారు. సో కాల్డ్ మేధావులు ఉదారవాదలు, వామపక్ష భావజాలంతో గల వారు తరుచుగా ఏవో సెమినార్లు, ఫెస్టివల్స్ కండక్ట్ చేసుకుంటూ ఉండేవారు. తమ అనుకూల ప్రభుత్వం ఉండడంతో స్పాన్సర్స్ కి కొదవ వుండేది కాదు.
సరిగ్గా ఇలాగే ఈ తెహల్కా 2013 లో “గోవా థింక్ ఫెస్టివల్” అని అనేక విషయాలపై, వివిధ వర్గాల అలోచలను పంచుకునేందుకు అని ఒక సమావేశం నిర్వహించింది. దాని ఉదారవాద భావజాలానికి సరిపోయే మేధావులను మరి కొందరు అమితాబ్ వంటి సెలబ్రిటీలను ఈ సమావేశంలో ప్రసంగించడానికి పిలిచారు. పేరుకే వివిధ వర్గాలు అని చెప్పుకున్నారు కానీ


ఈ వక్తలలో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం, తాలిబాన్ ఫౌండర్ మెంబెర్స్ లో ఒకరైన ‘ముల్లా జయీఫ్’ ని కూడా పిలిచారు కానీ ఏ ఒక్క రైట్ వింగ్ స్పీకర్ నీ ఆహ్వానించలేదు.
ఇంత వివాదాస్పద వ్యక్తి అయిన తాలిబాన్ నేత జయీఫ్ ని ఈ సమావేశానికి తెహల్కా నిర్వాహకులు ఆహ్వానించారు అంటే వారికి ప్రభుత్వం పై ఉన్న పట్టు చూడండి..నిఘా వర్గాల ద్వారా క్లియరెన్స్ ఇప్పించి ఈ జయిఫ్ కి విసా వచ్చేటట్లు చూసుకున్నారు. అదే మీటింగ్ కి యుపిఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం కూడా వెళ్లాడు.పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా మరియు మరికొన్ని దేశాల పౌరులకు వీసా మంజూరు చేసే సమయంలో కఠినమైన నేపథ్య తనిఖీ మరియు ప్రపంచ తీవ్ర వాద శక్తులపై వ్యతిరేకంగా గట్టిగా పోరాడతామని గతంలో యుపిఎ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించిన కఠినమైన వైఖరికి ఈ చర్య పూర్తిగా భిన్నం.
ఈ తెహల్కా థింక్ ఫెస్టివల్ వెబ్ పేజీలో ఈ జాయీఫ్ గురించి చాలా గొప్పగా రాశారు. ఇతను తాలిబాన్ వ్యవస్థాపకుల్లో ఒకరు అని దాని అధినేత ముల్లా ఒమర్ కి చాలా సన్నిహితుడు అని, అతన్ని అమెరికా అన్యాయంగా అరెస్ట్ చేసి 4 సం.లు జైలులో వుంచి విడుదల చేసింది అని, బీద కుటుంబం నుండి వచ్చిన గొప్ప పోరాట యోధుడు అంటూ రాసుకు వచ్చింది.
సరే! ఇలా చిదంబరం, జయీఫ్ ఓకే మీటింగ్ లో పాల్గొన్నారు అని బిజేపి లేవనెత్తిన వెంటనే ఆ జయీఫ్ ని యుపిఏ ప్రభుత్వం ఏమి ఆహ్వానించలేదు, ఆ మీటింగ్ నిర్వాహకులు జయీఫ్ ని ఆహ్వానించారు, దానిలో పాల్గొనడం చిదంబరం తప్పు ఎలా అవుతుంది అని ముఠా సభ్యులు చిదంబరాన్ని వెనకేసుకు వచ్చారు.
అతను వ్యక్తి గత హోదాలో సమావేశానికి వెళ్లకూడదా అని బీజేపి మీద ఈ ముఠా ఎదురు దాడి ప్రారంభించింది.
మంచిదే! మరి ఇదే సూత్రాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కి వర్తింపచేసారా? లేదు. ప్రణబ్ RSS మీటింగ్ వెళ్లి సెక్యులర్ విలువలకు తూట్లు పొడిచారు అని ఇదే ముఠా రీముల కొద్దీ వ్యాసాలు రాసి గంటల కొద్దీ టివి డిబెట్లలో ప్రణబ్ ని విమర్శించారు.
ఇప్పుడు తెలిసిందా ఈ సెక్యులర్ ముఠాకు ఉన్న దేశ విదేశీ కనెక్షన్స్. ఇదే మీటింగ్ కి జయీఫ్ తో ఒక సీనియర్ బీజేపి సీనియర్ నేత అటెండ్ అయి వుంటే రెండు మతోన్మాద శక్తులు కలయిక అని పెద్ద హెడ్డింగ్స్ పెట్టీ వ్యాసాలు రాసేవారు.
…చాడా శాస్త్రి….