నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు కుటుంబసభ్యుల ఫిర్యాదును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సభాహక్కుల కమిటీకి పంపారు. రఘురామ అంశంపై వెంటనే నివేదిక ఇవ్వాల్సిందిగా హోంశాఖనూ కోరారు. ఈమేరకు రఘురామ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు కాపీని కూడా హోంశాఖకు స్పీకర్ కార్యాలయం అందజేసింది. . అక్రమాస్తుల కేసులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేశారన్న కక్షతోనే… రఘురామపై రాజద్రోహం కేసు పెట్టారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమకు ప్రాణభయం ఉందని.. జోక్యం చేసుకుని న్యాయం చేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు.కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, తనయుడు భరత్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన రఘురామ సతీమణి రమాదేవి… ఓం బిర్లా, రాజ్‌నాథ్‌ను కలిశారు. రఘురామరాజుపై జగన్ ప్రభుత్వం సీఐడీ ద్వారా అక్రమంగా పెట్టిన కేసులు, అరెస్టు తీరు, భౌతిక దాడులు, కోర్టు ఆదేశాల ధిక్కరణలను వివరించినట్టు తెలిసింది. అంతకుముందు స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. రఘురామపై ఏవిధంగా భౌతికంగా దాడులకు తెగబడ్డారో వివరించారు.