బంగ్లా హిందువులకు బాసటగా నిలుద్దాం – భయంకర దాడులను నిలువరించుదాం
…….. వకుళాభరణం
…………………….
ఆగస్టు 5వ తేదీన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వాజేద్ ఆ దేశాన్ని విడిచి వెళ్లిన వెంటనే ఆ దేశంలో మతోన్మాదులు చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ లోని మైనార్టీల పై ముఖ్యంగా హిందువులపై దాడులకు దారుణాలకు తెగబడ్డారు.
వరదల్లో దేశం అతలాకుతలం అయినప్పుడు అన్నం పెట్టి ఆదుకున్న ఇస్కాన్ సంస్థను కూడా ఈ మతోన్మాదులు వదలలేదు. షేక్ హసీనా దేశాన్ని విడిచి వెళ్లిన రోజే మెహెర్పూర్ లోని ఇస్కాన్ కేంద్రాన్ని తగులబెట్టి అక్కడి విగ్రహాలను ధ్వంసం చేయడంతో మొదలైన దాడులు నేటికీ కొనసాగుతూ నానాటికీ పెచ్చుమీరుతున్నాయి.
Our Chinmoy Prabhu stood by everyone during the flood.#SaveBangladeshiHindus pic.twitter.com/oloI9KvNnB
— Puja Das (@Pujadas2211) November 4, 2024
ఆ ఘటనల వరుసక్రమాన్ని ఒకసారి పరికిస్తే…
వినాయక నవరాత్రుల సందర్బంగా సెప్టెంబర్ 7వ తేదీన చిట్టగాంగ్ లో గణపతి ఉత్సవాలు జరుగుతున్నపుడు దౌర్జన్యకారులు ఈ భక్తులపై రాళ్ళదాడికి తెగబడి వేడి నీళ్ళు కుమ్మరించి రాక్షసానందం పొందారు.
ఇక మరో సంఘటన మానవత్వనికే మచ్చ తెచ్చేదిగా ఉంది. ఈ సంఘటనలో బరిసల్ అనే ప్రాంతం లో తమ పాఠశాల లోనే చదువుతున్న 13ఏళ్ళ బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఇలాంటి దాడులు ఇక్కడ నిత్య కృత్యాలే. ఇవి ఇప్పుడు కొత్తగా మొదలైనవి కాదు. 2021సంవత్సరంలో అక్టోబర్ 15వ తేదీన నౌఖాలి లోని ఇస్కాన్ ఆలయం పై సుమారు 500మంది దాడిచేసి ఒక కృష్ణ భక్తుడిని హతమార్చారు. 2022మే 18న డాకా లోని ఇస్కాన్ ఆలయం పై దాడి చేసి అక్కడి భక్తులను గాయపరిచారు.
మరో సంఘటనలో కాళికా మాత ఆలయంపై దాడి చేసి భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ బహూకరించిన కిరీటాన్ని ఎత్తుకెళ్లారు. విగ్రహాల వ్విధ్వంసం, మహిళలపై అత్యాచారాలు, గృహదహనాలు ఒకటేమిటి అనేకరకాల చిత్రహింసలు ఇక్కడ నిత్యకృత్యంగా మారాయి.
వీటిని నిరసిస్తూ.. బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా 150ప్రాంతాల్లో హిందూ మైనారిటీలు రోడ్లపైకి వచ్చి శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇది గిట్టని దుర్మార్గులు రంగపూర్ ప్రాంతంలో రాళ్ళు కట్టెలతో విచక్షణా రహిత దాడికి తెగబడ్డారు.
ఇలా దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో 15 దేవాలయాలు, 200కు పైగా ఇండ్లు, ఎన్నెన్నో వ్యాపారాలు ధ్వంసం అయ్యాయి. 12మంది మరణించారు. గాయపడ్డవారైతే అనేకం.9ఇస్కాన్ కేంద్రాలపై ప్రత్యేకంగా దాడులు జరిగినాయి. 24చోట్ల హిందువుల శాంతియుత ప్రదర్శనలపై దాడులు జరిగాయి. ఇక మహిళలపై అత్యాచారాలకు అంతేలేదు.
వీటన్నిటికి పరాకాష్టగా నవంబర్ 25వ తేదీన ఇస్కాన్ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్ ను ప్రభుత్వం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచకుండా అజ్ఞాత ప్రదేశంలోకి తీసుకెళ్ళింది.
ఇస్కాన్ ఏమైనా దేశ ద్రోహం చేసిందా అంటే …
2024లో వచ్చిన వరదల్లో వేలాదిమందికి ఆశ్రయం కల్పిస్తూ మతంతో సంబంధం లేకుండా ఆహారాన్ని అందించింది.
ఇలాంటి సహాయం చేసిన సంస్థలపై, వ్యక్తులపై దాడులు చేయడం, దాడులు చేసిన వారిని శిక్షించకుండా.. దాడికి గురైన వారిపై కేసులు వేయడం, న్యాయ సహాయం అందించక పోవడం, హిందువులపై నానాటికీ హింసను పెంచడం, బలవంతపు మత మార్పిడులు, అకృత్యాలు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ఈ అకృత్యాలను నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది.
ఐక్యరాజ్యసమితి నేత్రుత్వంలో ఒక నిజానిర్ధారణ కమీషన్ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది.ఈ కమిటీ ఈ హింసను పరిశీలించి మైనార్టీల హక్కులను పర్యవేక్షించే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలి. ప్రపంచ దేశాలు బంగ్లాదేశ్ తో జరిగే వాణిజ్య చర్చల్లో, ఇతర మౌళిక చర్చల్లో ఈ హింసను చర్చించాలి. హిందూమైనార్టీలకు తక్షణ న్యాయ సహాయం అందించాలి. ధ్వంసమైన దేవాలయాలు, ఇండ్లు, సంఘాల భవనాలు, స్థలాలను పునరుద్దరణ చేయడానికి అంతర్జాతీయ సమాజం సహాయం అందించాలి.
ఈ క్లిష్ట సమయంలో భారతదేశం, అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ బాదితులకు అండగా నిలిచి తమ సమాఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచ శాంతి, సౌభ్రాత్రుత్వన్ని కాపాడాలని సంబంధిత ప్రభుత్వాలను డిమాండ్ చేయడానికి ప్రపంచ ప్రజలంతా ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది.