ఇటీవల కాలంలో క్రైస్తవ మిషనరీలు రెచ్చిపోతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోని గిరిజన ప్రాంతాల మీద ఫోకస్ చేసి మతమార్పిడులకు పాల్పడుతున్నాయి. సెక్యులర్ రాజకీయాలు చేస్తున్న పార్టీల నాయకులు కూడా క్రైస్తవం కోసం పాకులాడుతున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ముఖ్యమంత్రి స్థాయి నాయకులకు కూడా చౌకబారు ప్రకటనలు చేస్తున్నారు. 2023 మిజోరం అసెంబ్లీ ఎన్నికలను కూడా చర్చి తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇది కాస్త సీఎం లాల్దుహోమా నేతృత్వంలోని అధికార జోరం పీపుల్స్ మూవ్ మెంట్ కి బాగా ప్రయోజనం చేకూరింది. చర్చి ప్రభావం కారణంగా, దాని ఫలితంగా సీఎం లాల్దూహోమా ప్రభుత్వం క్రైస్తవ మిషనరీల అంచనాలకు అనుగుణంగానే నిర్ణయాలు కూడా తీసుకోవడం ఆలోచించాల్సిన విషయం.
అందుచేతనే ముఖ్యమంత్రి ప్రకటనలు కూడా దిగజారి కనిపిస్తున్నాయి. లాల్దూహోమాకి సంబంధించి ఓ దిగ్భ్రాంతికర వార్త వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ మాసంలో ఆయన అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడున్న మిజోరాం కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘మనమందరమూ ఒకే కుటుంబం. విడివిడిగా వుండొద్దు. ఆ దేవుడి బలంతో ఒక దేశంగా ఏర్పాడాలన్న మన కల నెరవేరుతుంది. నిజమైన దేశానికి సరిహద్దులుండవు. మనల్ని బలవంతంగా విడదీశారు. దీంతో మనం మూడు దేశాల్లోని మూడు విభిన్నమైన ప్రభుత్వాల కింద బతుకుతున్నాం. ఈ అన్యాయాన్ని మనం అంగీకరించొద్దు. ఇది నిజంగా మనకు దేవుడిచ్చిన వరం. ఈ ఏకీకరణ లక్ష్యం కోసం పనిచేద్దాం. దేవుడు మనకు ఏదో రకంగా సాయం చేస్తాడు. బైబిల్ లో చెప్పినట్లు బలం, శక్తి, అధికారంతో కాదు.. స్ఫూర్తితో మీకు అండగా వుంటా అని బైబిల్ లో ఆ దేవుడు చెప్పినట్లు….ఈ కష్టతర ప్రయత్నంలో దేవుడు మనకు అండగా వుంటాడు మంచైనా, చెడైనా మనం ఆయన దగ్గరే ఆశ్రయం పొందుతాం. క్రైస్తవ దేశాన్ని సాధించుకుందాం”” అని ఆయన ప్రకటన చేశారు.
చర్చిలను బలపరచాలని ముఖ్యమంత్రి స్వయంగా కోరడం ఒక విడ్డూరం. చర్చిలు ఏర్పాటు చేసిన వివిధ సంస్థలు, అంతర్జాతీయంగా వున్న క్రైస్తవ మిషనరీలు గురించి కూడా సీఎం మాట్లాడారు. దీనికి భారీగా నగర సమకూర్చాలని కూడా ఆయన కోరుతున్నారు.