ఆస్ట్రేలియా క్రికెటర్, లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ గుండెపోటుతో చనిపోయారు. థాయిలాండ్‌లోని కోహ్ సమీయులో షేన్ వార్న్ విల్లాలో ఆయన కుప్పకూలారు. అక్కడి సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. షేన్ వార్న్ ఇక లేరనే వార్త విని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. వార్న్ ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నానని… ఆయన సహచర క్రికెటర్లు ట్వీట్ చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్ గా రాణించిన వార్న్…ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఎనిమిది వికెట్లు, ఒక మ్యాచ్ లో 12 వికెట్లు తీసి రికార్డు సృష్టించారు. ఐపీఎల్లో 2008లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూ దగ్గరయ్యాడు వార్న్.