దేశంలో వ్యాపారం , నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా … పాన్‌కార్డ్ నంబర్‌కు ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా చట్టబద్ధత కల్పించాలని యోచిస్తోంది. ఈ మేరకు బడ్జెట్-2023లో కీలక ప్రకటన చేయవచ్చునని అంచనా . పాన్‌ను ‘సింగిల్ బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్’ గుర్తించడం ద్వారా వ్యాపారాల పన్ను చెల్లింపులు మరింత సరళీకృతం అవుతాయని కేంద్రం భావిస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో వ్యాపారం చేయాలంటే అవసరాలను బట్టి వేర్వేరు ఐడెంటిఫికేషన్ నంబర్లు తీసుకోవాల్సి వస్తోంది. ట్యాక్సుల రిజిస్ట్రేషన్, లోన్ లేదా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్… ఇలా వేర్వేరు ఐడెంటిఫికేషన్ నంబర్లు ఉండాలి.బిజినెస్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా పాన్‌ను గుర్తిస్తే మరింత ప్రయోజనకరమని భావిస్తున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
కాగా 10-డిజిటల్ అల్ఫాన్యుమరిక్ నంబర్ అయిన పాన్‌కార్డును ఆదాయ పన్ను విభాగం జారీ చేస్తుంది. వ్యక్తులు, సంస్థల ఆదాయ పన్ను రిటర్నులు, పరిమితికి మించిన ఆర్థిక లావాదేవీల విషయంలో పాన్‌కార్డు తప్పనిసరిగా ఉంది. ఒకవేళ సింగిల్ ఐడెంటిఫికేషన్ నంబర్‌గా గుర్తిస్తే పలు విధాలుగా ఉపయోగపడనుంది.