ఉత్తరప్రదేశ్ ప్రభత్వం ఆలీఘడ్ ఊరు పేరును “హరి ఘడ్” గా మార్చాలి అని నిర్ణయించింది.
అయితే ఇలా అలీగఢ్ నుండి హరిగఢ్ గా మార్చడం మతతత్వ అజెండా లో భాగమే అని దీనికి చారిత్రక ఆధారాలు ఏమీ లేవు అని మరాఠాలుమ జనరల్ నజాఫ్ అలీ ఖాన్ ద్వారా అలీగఢ్‌కు ఈ పేరు పెట్టారని రికార్డులు చూపిస్తున్నాయి అని అలిఘడ్ ముస్లిం యూనివర్సిటీ ప్రొఫెసర్ రెజావి రాశారు అని ప్రముఖ మార్క్సిస్ట్ చరిత్రకారుడు ఇర్ఫాన్ హబిబ్ పేర్కొన్నాడు.
అయితే ఈ వాదనలో డొల్లతనం, ఈ వామపక్ష చరిత్ర కారులు చరిత్ర వక్రీకరించి విధానం ఎండగడుతూ రుజువులు తో సహా భరద్వాజ్ వారి వాదనను తిప్పికొట్టాడు.
అంతే కాదు అసలు చరిత్ర పట్ల, ఆ సంఘటనలు జరిగిన ఆ సంవత్సరాలు పట్ల కూడా ఈ వామపక్ష చరిత్ర కారులకు కనీస అవగాహన లేదు అని ఆధారాలతో రుజువు చేశాడు. చరిత్ర పట్ల ఇంత సబ్ స్టాండర్డ్ అవగాహన వున్న వారు ఈ దేశ చరిత్ర గురించి రాసి పడేశారు.
భరద్వాజ్ మాటల్లోనే :
1. అతను(ఇర్ఫాన్ హాబిబ్) “ప్రముఖ” చరిత్రకారుడు. అతను AMU నుండి మరొక “ప్రముఖ” చరిత్రకారుడిని ఉటంకించాడు.
ఒకే వ్యాసంలో, వారు అనేక తప్పులు రాశారు వారు తమ ప్రాథమిక తేదీలను కూడా సరిగ్గా ఉటంకించ లేదు. వారి వాదనలు వాస్తవంగా తప్పు మరియు నకిలీవి. ఈ దిగువ చదవండి.
2. Rezavi యొక్క వ్యాసం యొక్క శీర్షిక ఇలా చెబుతోంది. “చారిత్రక రికార్డులు ప్రకారం అసలు మరాఠాలు ఈ అలీగఢ్ అనే పేరు సూచించారు. మరాఠాల గవర్నర్ నజాఫ్ అలీ ఖాన్ దానిని అలీఘర్ అని పేరు మార్చారు”
ఇది వ్యాసం యొక్క ప్రధాన వాదన. కానీ ఇది నకిలీ దావా. ఎందుకంటే అసలు నజాఫ్ అలీ ఖాన్ మరాఠా కమాండర్ కాదు.
3. ఈ “ప్రముఖ” చరిత్రకారులు @irfhabib మరియు @Rezavi లు లా కాకుండా నా వద్ద దీనికి ఆధారాలు ఉన్నాయి. కలెక్టర్ JR హచిన్సన్ రాసిన (1856) “అలీగఢ్ స్టాటిస్టిక్స్” ప్రకారం నజాఫ్ అలీ ఖాన్ “మొఘల్ జనరల్” అని ‘మరాఠా జనరల్’ కాదని స్పష్టంగా పేర్కొనబడింది.
అతను రామ్‌గఢ్ పేరును అలీఘర్గా మార్చాడు అని రాయబడింది.
4. నిజానికి, నజాఫ్ అలీ ఖాన్ మొఘల్ చక్రవర్తి షా ఆలం యొక్క కుడి చేయి. నజాఫ్ అలీ ఖాన్ మరాఠా గవర్నర్ కాదు. నిజానికి, 18 వ శతాబ్దంలో “నజాఫ్ అలీ ఖాన్” అనే పేరుతో మరాఠా గవర్నర్ లేరు. జదునాథ్ సర్కార్ రచించిన “ది ఫాల్ ఆఫ్ మొఘల్ ఎంపైర్” నుండి స్నిప్పెట్ క్రింద ఇచ్చాను.
5. అసలు నజాఫ్ అలీ ఖాన్ ఎవరు?
ఒక పెర్షియన్, మొఘల్ అధికారిని వివాహం చేసుకున్న నజాఫ్ సోదరితో పాటు అతను భారత్ వచ్చి మొఘల్ సేవలో చేరాడు.
అసలు “మరాఠా గవర్నర్” సంగతి పక్కన పెట్టండి. అతను మరాఠాలు వైపు కాకుండా మరాఠాలపై యుద్ధాలు చేశాడు (బ్రిటిష్ వారితో)
6. అంతే కాదు. ఈ వ్యాసంలో @rezavi మరో మాట చెప్పారు. “మాధవ్ రావు సింధియా 1759 లో ఫ్రెంచ్ కమాండర్ డి బోయిగ్నేతో కలిసి అలీఘర్‌ను స్వాధీనం చేసుకున్నారు.” అని
హా.హా.హా. అసలు డి బోయిగ్నే 1759 లో 8 సంవత్సరాల పిల్లవాడు. మరియు అతను ఫ్రాన్స్‌లో ఉన్నాడు. అతను 1778 వరకు భారతదేశానికి రాలేదు.
ఇది ఈ ప్రముఖ AMU చరిత్రకారులకు చరిత్రపై ఉన్న అవగాహనా స్థాయి.
7. నకిలీ ఉదాహరణ లు, నకిలీ తేదీలు, నకిలీ వాదనలు. ఇదీ ఈ ప్రముఖ చరిత్రకారుల వాస్తవికత. వారికి కనీస జ్ఞానం లేదు కానీ వారు పండితులుగా ప్రకటించుకుంటారు.
వీరు ప్రధానంగా రాజకీయ ప్రచారకులు. “మరాఠాలు దీనికి అలీఘర్ అని పేరు పెట్టారు, కాబట్టి దాని పేరు మార్చవద్దు” అనేది వీరి నకిలీ వాదన.
8. @Rezavi తన వ్యాసంలో యొక్క మరొక తప్పుడు వాదన చేశారు. ఏమిటంటే, 1753 లో జాట్లు దీనికి రామ్‌గఢ్ అని పేరు పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఇది తప్పు. జాట్ ఆక్రమణకు ముందు నుండే దీనిని రామ్‌ఘర్ అని పిలిచేవారు. హిందువులు దీనిని కనీసం 16 వ శతాబ్దం నుండి “రామ్‌గఢ్” అని సంబోధించారు మరియు బహుశా అంతకు చాలా ముందు నుంచి కూడా ఉందేమో?!
9. @irfhabib @Rezavi ఈ ప్రముఖ చరిత్రకారులకు నేను ఒక సాధారణ ప్రశ్న వేస్తాను.
అసలు “మాధవ్ రావు సింధియా” ఎవరు?
మాధవరావు పేష్వా, సింధియా కాదు. మహాద్జీ సింధియా. ఒక పాఠశాల విద్యార్థికి కూడా సింధియా మరియు పేష్వా మధ్య వ్యత్యాసం తెలుసు. . కానీ ఇది కూడా తెలియని మీరు చరిత్రకారులు అని పిలుచుకుంటున్నారు? షేమ్!
10. ఈ వ్యాసంలో మరొక అబద్ధం ఏమిటంటే
-“డి బోయిగ్నే మాధవరావు కోసం పనిచేశాడు” ఇది తప్పుడు సమాచారం. అసలు డి బోగ్నే భారతదేశానికి రాకముందే మాధవరావు మరణించారు.
ఇది అతి బేసిక్ జ్ఞానం. ఒక సాధారణ గూగుల్ సెర్చ్ వారిని ఇటువంటి ఇబ్బంది నుండి కాపాడేది. కానీ అది కూడా చేయకుండా ఈ ప్రఖ్యాత చరిత్రకారులు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకోడానికి చాలా కష్ట పడుతున్నారు.
11. నేను వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్ హాబిబ్ నుండి వచ్చిన చాలా గొప్ప స్పందన ఏమిటంటే అతను ట్విట్టర్ ఖాతాలో నన్ను బ్లాక్ చేసుకున్నాడు
వారి వ్యాసానికి నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నానో ప్రజలు చూడకుండా ఉండటానికి అతను నన్ను బ్లాక్ చేశాడు. ఇది అతనిని ఈ ఎక్స్పోజ్ మరియు ఇబ్బంది నుండి కాపాడుతుందని అతను భావిస్తున్నాడు ఏమో?
Thread By TrueIndology @BharadwajSpeaks in Twitter
https://twitter.com/BharadwajSpeaks/status/1436395778994425859?s=20
స్వేచ్చానువాదం..
…చాడా శాస్త్రి…