మరణం ఎవరికైనా మరణమే.
విచారకరమైన వార్తే.
కానీ ఒక్కో మరణంపై మన మేధావులు స్పందించే తీరు చూస్తే బాధ వేస్తుంది.
ఏ విచారణ లేకుండా కనీసం ఛార్జ్ షీట్ ఫైల్ చెయ్యకుండా 9 సం.లు జైల్లో ఉంచి థర్డ్ డిగ్రీ చిత్రహింసలు పెట్టిన కల్నల్ పురోహిత్ పై కానీ పాకిస్తాన్ టెర్రరిస్టులను తప్పించడానికి రాజ్యం టెర్రర్ కేసులో ఇరికించిన సాధ్వి ప్రజ్ఞా ఠాకూర్ పై జరిగిన హింస గాని ఈ మేధావుల దృష్టిలో ‘రాజ్య హింస’ కాదు.
ఎంతో గొప్ప సర్వీస్ రికార్డ్ ఉందని సీనియర్ మిలిటరీ అధికారులచే మన్నలను పొందిన కల్నల్ పురోహిత్ చేసిన తప్పు ఏమిటి? ఆయన మిలిటరీ ఇంటెలిజెన్స్ ద్వారా సంపాదించిన సమాచారం అంటే దావూద్ గ్యాంగ్ కి కొందరు జాతీయ మరియు మహారాష్ట్ర రాజకీయనాయకులకు గల సంబంధాలపై రిపోర్ట్ తయారుచేయడం కొందరు రాజకీయ నాయకులకు మింగుడుపడలేదు. ఆయన్ను టెర్రరిజం కేసులో ఇరికించారు.
అప్పుడు ఈ మేధావులు స్పందించలేదు. అది రాజ్య హింస గా కనిపించడం లేదు.
అంతదాకా ఎందుకు? పశ్చిమ బెంగాల్ లో మే నెల 2వ తేదీన ఎన్నికలు ఫలితాలు వచ్చిన దగ్గర నుండి గత రెండు నెలలుగా అక్కడ ప్రభుత్వాన్ని పాలిస్తున్న పెద్దల మద్దత్తు ఉన్న గూండాల చేతిలో డజన్ల కొద్దీ హత్యలు, లూటీలూ, గృహ దాహనాలూ, ఆడపిల్లల, స్త్రీల మానభంగాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నా కనీసం ఒక పోస్ట్ పెట్టలేదు. అది రాజ్యహింస గా కనిపించలేదు.
కానీ ఎందరో గిరిజనులకు మాయమాటలు చెప్పి మతం మార్చి, మరికొందరిని బూజు పట్టిన విప్లవ సిద్ధాంతాలతో ప్రభుత్వం మీదకు రెచ్చగొట్టి వారి వల్ల జరిగిన హింసలో ఎందరో అమాయకుల గిరిజనుల మరణాలకు కారణమై ఎందరో తల్లులకు కడుపు కోత మిగిల్చిన 84 ఏళ్ల ఒక స్టాన్ స్వామి అనే నక్సల్ సానుభూతిపరుడు, మత మార్పిడులు పాస్టర్, పండు ముసలి ముంబాయి స్టార్ ఆసుపత్రిలో మే నెల నుండి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో మృతి చెందితే దానిని ‘రాజ్య హింస’ కింద జమకట్టడం ఈ మేధావులకే చెల్లింది.
కానీ విచిత్రం ఏమిటంటే అధికారం చేజారి పోతుందన్న భయంతో దేశంలో ఎమెర్జెన్సీ పెట్టి ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులు అన్ని తుంగలో తొక్కి కొన్ని వేల మందిని జైల్లో తోసి వందల మంది చావుకు కారణమైన నియంత ఇందిరను మళ్లీ వీరే నెత్తిన పెట్టుకుంటారు. అప్పుడు సామాన్య జనాలపై జరిగింది రాజ్యహింస గా వీరు గుర్తించరు.
ఈ ద్వంద్వ ప్రమాణాల వల్లే ఈ వామపక్ష భావజాలం మట్టికొట్టుకు పోయింది. ప్రతీదీ ప్రశ్నించే తత్వమున్న , అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్న ప్రస్తుత తరాన్ని ఈ పిడివాద, హింస ప్రేరేపించే వామపక్ష సిద్దాంతాలు అందుకే ఆకర్షించలేకపోతున్నాయి.. గతంలో ప్రింట్ మీడియా మాత్రమే సమాచార సాధనంగా ఉండేది. దాని సంపాదకులు, విలేకరుల ద్వారా దాన్ని గుప్పెట్లో పెట్టుకొని తమ భావజాలాన్ని ప్రజలపై రుద్దుతూ రెండవ వైపు వాదన తొక్కిపెడుతూ కాలం నెట్టుకువచ్చారు. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగి సోషల్ మీడియా వ్యాప్తి చెందడం ప్రారంభం అయి ప్రజలు పూర్తి సమాచారం అందుబాటులో కి రావడం మొదలు అయిందో అప్పటి నుండి ఈ వామపక్ష సిద్దాంతం పతనం ప్రారంభం అయింది.
…చాడాశాస్త్రి..