సిగరెట్ తాగుతున్న కాళీమాత పోస్టర్ ను ప్రదర్శించి లీనా దానిమీద చర్చ నడుస్తుండగానే మరో వివాదాస్పద ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. శివ,పార్వతుల వేషధారణల్లో ఉన్నవ్యక్తులు ధూమపానం చేస్తున్నట్టు అందులోఉంది. మరెక్కడైనా…అంటూ దానికి కాప్షన్ ఇచ్చారు లీనా. దీనిపైనా దుమారం రేగగా..అది తన డాక్యుమెంటరీలో భాగం కాదని…గ్రామీణ భారతంలోని నిజదృశ్యమని సమర్థించుకున్నారు. కాళీమాత పోస్టర్ కు సంబంధించి ఇప్పటికే భారత్ లో పలుచోట్ల ఆమెపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వారంలో తన కుటుంబసభ్యులకు తనకు లక్షల్లో బెదిరింపు కాల్స్ వచ్చాయని వాపోయింది లీనా.
https://twitter.com/LeenaManimekali/status/1544860079945646080?s=20&t=oVzx6VeWmCaJ4-CUlbeBUg