భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ రాజకీయ అరంగేట్రం చేశారు. పేస్ తృణమూల్ పార్టీలో చేరారు. పశ్చిమబంగ సీఎం మమతా బెనర్జీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.పేస్ తనకు సోదరుడిలాంటివాడని…తాను యువజన మంత్రిగా ఉన్నప్పటినుంచీ తెలుసని…ఇప్పుడు తనపార్టీలో చేరడం సంతోషంగా ఉందని మమత ట్వీట్ చేశారు.
గోవా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పేస్ చేరిక తమకు కలిసి వస్తుందని టీఎంసీ శ్రేణులూ ఉత్సాహంగా చెబుతున్నాయి.