భారీవర్షాలకు నిర్మల్ జిల్లాలోని చాలాగ్రామాలు జలమయమయ్యాయి. సోన్ మండలం మాదాపూర్ లో భారీ వర్షానికి రోడ్లూ నిండిపోయాయి.
దెబ్బతిన్న రోడ్లు,బ్రిడ్జిలు, పంట పొలాలను నిర్మల్ బీజేపీ నాయకులు అప్పాల గణేష్ చక్రవర్తి పరిశీలించారు. భారీ వర్షాలకు 400 నుంచి 500 ఎకరాల పసుపు, మొక్కజొన్న, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. నష్ట పోయిన రైతులకు పరిహారం అందేలా ప్రభుత్వాన్ని , అధికారులను కోరుతామని తెలిపారు.
ఎక్కడిక్కడ చెరువులు, వాగులు నిండి పొంగిప్రవహిస్తున్నాయని.. కరెంట్ స్థంభాలు విరిగిపడుతున్నాయని అందరూ జాగ్రత్తగా ఉండాలనీ అన్నారు. నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్ , మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు సాదం అరవింద్ , అసెంబ్లీ కన్వీనర్ కొరిపెళ్ళి శ్రావణ్ , నిర్మల్ పట్టణ కౌన్సిలర్ కత్తి నరేందర్ , నాయకులు సైండ్ల శ్రీధర్ , మండల నాయకులు రైతులను, ముంపుప్రాంతప్రజల్ని పరిశీలించిన వారిలో ఉన్నారు.