దేశంలోనే ప్రతిష్టాత్మక స్టార్టప్ ఇంక్యుబేటర్ టి-హబ్-2 ప్రారంభమైంది. పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ… స్టార్టప్ లనూ ప్రోత్సహిస్తోంది. ఇందుకోసమే ఏడేళ్ళ క్రితమే (2015) టి-హబ్ పేరుతో స్టార్టప్ ఇంక్యుబేటర్ సెంటర్ ను రాజధాని హైదరాబాద్ లో ఏర్పాటుచేసింది. దీన్ని మరింత విస్తరిసతూ టి-హబ్ 2.0 ఐటీ హబ్ మాదాపూర్ లో అత్యాధునిక సౌకర్యాలు, హంగులతో టీ-హబ్ 2 రూపుదిద్దుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ రెండో దశను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఈ రెండో దశలో.. ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం గమనార్హం. మంగళవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
“The best way to predict the future is to create it” – Lincoln
Delighted to announce that Hon’ble CM KCR Garu will be inaugurating the new facility of @THubHyd on 28th June giving a huge fillip to the Hyderabad Innovation ecosystem#InnovateWithTHub #HappeningHyderabad #THub pic.twitter.com/ZT1BtRWoGt
— KTR (@KTRBRS) June 26, 2022
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీహబ్ సీఈవో శ్రీనివాస్‌రావు, సైయింట్ వ్యవస్థాపక చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. అలాగే అడోబ్ చైర్మన్, సీఈవో శంతనునారాయణ్, సికామోర్ నెట్వర్క్స్ సీఈవో దేశ్‌పాండే, అతేరా ఎండీ కన్వయ్ రేఖి, ఇతర దేశవిదేశీ ప్రముఖులు వీడియో సందేశాలిచ్చారు. టీ హబ్2 ప్రారంభోత్సవం సందర్భంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది ప్రభుత్వం. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో భారతీయ భాషల మైక్రో బ్లాగ్ కూ (KOO) యాప్‌తో పాటు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, హీరో మోటర్ గ్రూప్, పొంటాక్, వెబ్3.0 సంస్థలతో టీ హబ్ ఒప్పందాలు కుదుర్చుకుంది.. ఇన్నొవెటివ్ సమ్మిట్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో డ్రావిన్ బాక్స్, మీషో, స్విగ్గి, జోమాటో, యూనికార్న్ స్టార్టప్ సంస్థలు పాల్గొంటున్నాయి.