గల్వాన్ లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో చనిపోయిన లాన్స్ నాయక్ దీపక్ సింగ్ సతీమణి రేఖాసింగ్ భర్తకు తగిన భార్య అనిపించుకున్నారు. భారత సైన్యంలో లెఫ్టినెంట్ గా ఎంపికయ్యారు. భర్త నుంచి స్ఫూర్తి పొందిన ఆమె…తాను చేస్తున్న టీచర్ ఉద్యోగాన్ని వదిలి పట్టుదలతో సైన్యంలో స్థానం పొందారు.
లాన్స్ నాయక్ దీపక్ సింగ్ 2020 జూన్లో చైనా సైనికులచేతిలో అమరుడయ్యారు. అప్పటికి తన పెళ్లై కేవలం 15 నెలలు మాత్రమే. ఆయన మరణానంతరం దీపక్ సింగ్ ను వీరచక్ర పురస్కారంతో గౌరవించింది. భర్త మరణంతో రేఖ శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే తనకు కూడా చిన్నతనంనుంచి దేశభక్తి, సేవాగుణం ఎక్కువ. అందుకే భారతసైన్యంలో చేరాలనుకుంది.అది అంత ఈజీ కూడా కాదు. సైన్యంలో చేరేందుకు మొదట నోయిడాలో శిక్షణ పొందారు. మొదటి ప్రయత్నంలో ఫిజికల్ ట్రైనింగ్ పొందినప్పటికీ…ప్రవేశపరీక్షలో విఫలమయ్యారు. పట్టుదలతో ప్రయత్నించి రెండో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. లెఫ్టినెంట్ ర్యాంక్ కు ఎంపికయ్యారు. లెఫ్టినెంట్ ర్యాంక్ శిక్షణ మే 28 నుంచి చెన్నైలో ప్రారంభంకానుంది.
లాన్స్ నాయక్ దీపక్ సింగ్ బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్లో పని చేశారు. మరణానంతరం వీర చక్ర పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది.