బిహార్ సీఎం లాలూప్రసాద్ యాదవ్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ప్రత్యేక విమానంలో ఆయన్ని తీసుకెళ్లారు.ఇటీవల తనింట్లో మెట్లపైనుంచి జారిపడడంతో లాలూకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.మరింత మెరుగైన చికిత్స కోసం డాక్టర్ల సలహా మేరకు ఎయిమ్స్ కు తరలించారు. అటు ప్రధాని మోదీ లాలూ తనయుడు తేజస్వియాదవ్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్యంగురించి అడిగి తెలుసుకున్నారు. లాలూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కింద పడడంతో ఆయన భుజం, నడుము దగ్గర ఎముకలు చట్లినట్టు వైద్యులు తెలిపారు. వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఆయనఉన్నారు.