బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ నుంచి ఆయనతో పాటు బీజేపీలోకి వచ్చి చేరిన ఆయన సన్నిహితులు, అనుచరులు సైతం పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ప్రధాని మోదీ మీద ఎన్నటికీ అభిమానం ఉంటుందని… అయితే రాష్ట్ర నాయకత్వం సరిగా లేకపోవడం వల్లనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు కన్నా. అనంతరం రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. ఇటీవలే రాష్ట్ర పార్టీ తీరుపై
అసంతృప్తిగా ఉంటున్న కన్నా… కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకూ ఆయన దూరంగా ఉంటున్నారు.