పాకిస్థాన్ గడ్డ మీద నుంచి నడుస్తున్న సీమాంతర ఉగ్రవాదం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి దాకా పురుషులు మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేవారు, ఇక నుంచి మహిళలు సైతం ఈ దరిద్రంలోకి దిగుతున్నట్లు సమాచారం. భారత ఇంటెలిజెన్స్ సంస్థలు ఇందుకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాయి.
…..
జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు నిషేధించాయి. భయంకరమైన ఉగ్రవాద కార్యకలాపాలు చేసి, వేలాది మంది అమాయకులను పొట్టన పెట్టుకొన్నారు. ఇప్పుడు ఈ ఉగ్రవాదులను ప్రపంచ దేశాలలోని ఏజన్సీలు గుర్తుపడుతున్నాయి. దీంతో అక్కడ మహిళలను రిక్రూట్ చేసుకొంటున్నారు. మహిళల కోసం ఒక ఆన్లైన్ కోర్సు పెట్టి ఒక్కొక్కరి నుంచి 500 పాకిస్థానీ రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు “జమాత్ – ఉల్-ముమినాత్” అనే మహిళా విభాగాన్ని సృష్టించింది.
…………………………………………………………………………………………
మహిళల కోసం ప్రత్యేకంగా “తుఫత్-అల్-ముమినాత్” అనే ఆన్లైన్ శిక్షణా కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సులో చేరిన వారికి జైషే-మొహమ్మద్ గ్రూప్‌నకు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాదాలు శిక్షణ ఇస్తారు. అందులో ప్రధానమైనవాళ్లు జైషే-మొహమ్మద్ వ్యవస్థాపకుడైన మసూద్ అజార్‌కు చెందిన బంధువులు… జీహాద్ గురించి, ఇస్లాం గురించి బోధిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఆన్లైన్లో నియామకాలు చేపడతారు. ఈ నవంబర్ 8 నుంచే ఈ కోర్సు ప్రారంభం కానుంది అని సమాచారం. ప్రతిరోజూ 40 నిమిషాల పాటు ఉగ్ర పాఠాలు బోధిస్తారు. వీటిని అజార్ సిస్టర్స్ అయిన సదియా అజార్, సమైరా అజార్ బోధిస్తారు. వారు మహిళలు కచ్చితంగా ‘జమాత్-ఉల్-ముమినాత్’లో చేరాలని ప్రోత్సహిస్తారని తెలుస్తోంది.
…………………………………
తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలను రిక్రూట్ చేసుకోవడానికి జైషే మహమ్మద్ తొలుత ప్రాధాన్యం ఇస్తున్నది. అందుచేత అనుమానాస్పద పరిస్తితులలలో మహిళలు కనిపించినా కానీ అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలు సూచిస్తున్నాయి. అమాయక మహిళల ముసుగులో ఈ లేడీ డాన్ లురెచ్చిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.



