దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కోల్ కతా లేడీ డాక్టర్ హత్యకేసు మీద కేంద్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. నేరస్తులను వేగంగా పట్టుకుని శిక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. 30 మంది సభ్యుల బృందానికి ఐపీఎస్ అధికారి సంపత్ నెహ్రా నాయకత్వం వహిస్తున్నారు. కానీ ఈ 30 మంది సభ్యుల బృందంలో, ఈ కేసును ఛేదించడానికి హామీగా ఉన్న ఒక ఆఫీసర్ ఉన్నారు. ఆమె పేరు సీమా పహుజా.
ఇప్పుడు ఈ లేడీ సింగం పేరు మార్మోగిపోతోంది. ఏఎస్పీ సీమా పహుజా ట్రాక్ రికార్డు అలాంటిది. ఢిల్లీ పరిసరాల్లో నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన లేడీ పోలీస్ ఆఫీసర్ ఆమె.
1993లో ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అయిన సీమా పహుజా, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ పొందారు . సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు . 1998లో సీమా పహుజా ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందారు. ఆమె ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చూసి సీమా పహుజా కి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు
సీబీఐ లో ఆమె మానవ అక్రమ రవాణా, మతమార్పిడి,
హత్యలు, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించి
నిందితులకు శిక్ష పడేలా చేశారు. సిమ్లాలోని కోథాయ్‌లోని గుడియాపై అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు
నేషనల్ షూటర్‌తో లవ్ జిహాద్ కేసును ఛేదించారు.
కుటుంబ బాధ్యతల కారణంగా తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకోవాలని ASP సీమా పహుజా CBI డైరెక్టర్ కు లేఖ రాశారు. కానీ ఉన్నతాధికారులు అందుకు ఒప్పుకోలేదు . మంచి కెరీర్ ఉంటుంది అని ఆమెని ప్రోత్సహించారు.సీమా పహుజా సామర్ధ్యం గల అధికారిగా పేరొందారు.
సీబీఐ లో దూసుకెళుతున్న సీమా ను బంగారు పతకాల తో ప్రభుత్వం సత్కరించింది. 2007లో హరిద్వార్‌లో జరిగిన జంట హత్యల కేసును ఛేదించినందుకు సీమా పహుజా మొదటి గోల్డ్ మెడల్ అందుకున్నారు
2014లో ఆగస్ట్ 15న సీమా పహుజాకు ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది.
తర్వాత 2018 కేంద్ర హోం మంత్రి ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకు ఎంపికయ్యారు . 2018లోనే, సిమ్లాలోని గుడియా అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు 50,000 రూపాయల నగదు పురస్కారంతో పాటు రెండో బంగారు పతకాన్ని స్వీకరించారు. ఇది కాకుండా, సీమా పహుజా అనేక ఇతర అవార్డులు అందుకున్నారు.
ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్య కేసు దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించినప్పుడు, ఈ కేసును ఛేదించే బాధ్యతను ఏఎస్పీ సీమా పహుజాకు సీబీఐ అప్పగించింది. ఇప్పటికే కోల్‌కతా చేరుకున్న ఏఎస్పీ సీమా పహుజా ఈ కేసు లో పరిస్థితులు విచారిస్తున్నారు. సీమా పహుజా సర్వీస్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే ఎన్నో సంక్లిష్టమైన కేసులును చేధించారు.
ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో .. సీమా పహుజా ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందని అంతా విశ్వసిస్తున్నారు. సీమ ట్రాక్ రికార్డు ద్వారా.. ఈ కేసులో కూడా త్వరలోనే నేరస్థులకు శిక్ష పడుతుంది అని ఆశిస్తున్నారు.