తెలంగాణ మాజీ మంత్రి కే తారక రామారావు మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కేటీఆర్ బుకాయిస్తున్నారని, ఆయన పబ్లిక్ కి అడ్డంగా దొరకపోయారని .. నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.
వారం రోజులుగా హైదరాబాద్ శివారు జన్ వాడ ప్రాంతంలో కే తారక రామారావుకి విశాలమైన ఫామ్ హౌస్ ఉంది అని వార్తలు గుప్పుమన్నాయి. ఇందులో నిబంధనలు ఉల్లంఘించి కట్టడాలు కట్టారు అంటూ చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. ఈ క్రమంలో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద విరుచుకు పడ్డారు. జన్ వాడ ప్రాంతంలో తనకు ఏ విధమైన ఫామ్ హౌస్ లేదని,, మిత్రుడికి సంబంధించిన ఫాంహౌస్ ను వాడుకుంటున్నాను అని ఆయన స్పష్టంగా చెప్పుకొని వచ్చారు. అక్కడ నిబంధనలు మీరినట్లయితే,, భవంతులు కూల్చివేయొచ్చు అని ఆయన సవాలు విసిరారు.
తాజాగా సోషల్ మీడియాలో కేటీఆర్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఎన్నికల సమయంలో కేటీఆర్ సమర్పించిన అఫిడవిట్ అంటూ కొన్ని కాపీలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో జన్వాడ ఫాం హౌస్ ను కేటీఆర్ తమ కుటుంబ ఆస్తి గా చూపించారు. కేటీఆర్ భార్య శైలిమ పేరుమీద సర్వే నెంబర్ 301లో ఉన్నట్లుగా ఈ అఫిడవిట్ లో చూపించారు.
ఈ కాపీలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నీటి ఆధారంగా కేటీఆర్ అడ్డంగా బుక్ అయ్యారు అంటూ వార్తల గుప్పుమంటున్నాయి. ఇదే అదను గా కాంగ్రెస్ మరియు బిజెపి వర్గాలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు .. కేటీఆర్ ను విపరీతంగా ట్రోల్లింగ్ చేస్తున్నారు.
కానీ కేటీఆర్ వర్గీయులు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న గేమ్ అని మండిపడుతున్నారు