తెలంగాణ మాజీ మంత్రి కే తారకరామారావు కి దారులు మూసుకుంటున్నాయి. హైకోర్టులో ఆయన క్యాష్ పిటిషన్ ను కొట్టివేశారు. దీంతో ఆయన్ని అరెస్టు చేయడం ఖాయం అని తెలుస్తోంది. ఇంకా చెప్పాలి అంటే కేటీఆర్ ను రేవంత్ రెడ్డి టీం… రౌండ్అప్ చేసింది అని అనుకోవచ్చు. ఇందుకు బలమైన రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి.
……
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు అన్న మాట వాస్తవం. దీనిమీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరికించేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఏదో ఒక మూల గులాబీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆందోళనలు చేపడుతూ ప్రజల్లో కలకాలం రేపుతున్నారు. మరో ప్రతిపక్ష పార్టీ బిజెపి ఈ అవకాశాన్ని పెద్దగా వాడుకోవటం లేదు. దీంతో గులాబీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలని సీఎం రేవంత్ రెడ్డి టీం .. పంతం పట్టింది. ఇందులో భాగంగా పాత కేసులను తీసినట్లైతే కేటీఆర్ ను అరెస్టు చేసి జైలుకు పంపించవచ్చు అనేది ఎత్తుగడ.
……
వాస్తవానికి గులాబీ పార్టీకి బలమైన నాయకత్వం అనేది సమస్యగా ఉంది. పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. దీంతో ఆయన నాయకులకు అందుబాటులోకి రావడం లేదు. చాలా కాలంగా కేటీఆర్ కనుసన్నల్లోనే పార్టీ యంత్రాంగం నడుస్తోంది. కేటీఆర్ కవిత హరీష్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ సమయంలో కేటీఆర్ ను జైలుకి పంపించి నట్లయితే…. గులాబీ నాయకులు గందరగోళంలో పడిపోతారు. లీడర్షిప్ కవిత తీసుకుంటే హరీష్ ఎంతవరకు సహకరిస్తారనేది క్వశ్చన్ మార్క్. దీంతో గులాబీ పార్టీలో చీలికలు తెచ్చేందుకు.. పాత కేసులను వెతికి పట్టుకొన్నారు………
ఈ క్రమంలో ఫార్ములా వన్ కేసు కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వచ్చింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఎటువంటి చెల్లింపులు చేయకూడదు. తప్పనిసరి అయితే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ముందుకు అడుగు వేయాలి. కానీ కేటీఆర్ ఒత్తిడితో అప్పటి అధికారులు విదేశీ కంపెనీలకు 50 కోట్లకు పైగా చెల్లించేశారు . రికార్డులతో సహా ఈ చెల్లింపులు దొరికిపోవడంతో కేటీఆర్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ కేసులు బుక్ చేసింది. కోట్ల రూపాయల మేటర్ కావడంతో ఈడీ కూడా రంగంలోకి దిగి కేసు పెట్టేసింది. విచారణకు రావాలి అంటూ ఏసీబీ మరియు ఈడీలు వరుసగా నోటీసులు పంపిస్తున్నాయి. ఇంకా చెప్పాలి అంటే అరెస్టు చేసి లోపల వేసేందుకు ఉరకలు వేస్తున్నాయి.
……..
కేసుల నుంచి బయటపడేందుకు మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఈ విచారణ ఆపాలంటూ హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేసుకున్నారు కానీ హైకోర్టు ఆయన అభ్యర్థనను తిరస్కరించింది . పైగా స్పష్టమైన ఆధారాలతో విదేశీ కంపెనీలకు చెల్లింపులు జరగడంతో కేటీఆర్ కు దారులు మూసుకుపోతున్నాయి.
…….
ఇప్పుడు కనుక కేటీఆర్ అరెస్టు జరిగితే గులాబీ పార్టీలో గందరగోళం ఖాయం. బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటినుంచో చెబుతున్నారు. కేటీఆర్ అంతటి నాయకుడే అరెస్టు అయితే తమ పరిస్థితి ఏమిటని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మొఖం చాటేయడం ఖాయం. దీంతో రేవంత్ రెడ్డి టార్గెట్ కి లైన్ క్లియర్ అవుతుంది. అందుచేతనే ఈ కేసులో సీఎం టీం అంత పట్టుదలగా ఉంది అని చెబుతున్నారు.