కశ్మీర్లోని లాల్ చౌక్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. 370 ఆర్టికల్ ఎత్తివేతకు ముందు లాల్ చౌక్ లో జాతీయ జెండానూ ఎగురవేయలేని పరిస్థితి.. ఆర్టికల్ ఎత్తివేతతో దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చిందంటూ జన్మాష్టమి వేడుకల్ని వైభవంగా నిర్వహించారు..పిల్లాపెద్దా, యువత రాధాకృష్ణుల వేషధారణలతో అలరించారు. భక్తుల భజన కార్యక్రమాలతో లాల్ చౌక్ పరిసరాలు మార్మోగాయి.