కృష్ణపట్నం కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు సమర్పించిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.అయితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మెడిసిన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది..కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి మందును కనిపెట్టారు. సహజసిద్ధమైన వస్తువులతో తయారైన ఆయుర్వేద మందుతో ఎలాంటి హానీ జరగదంటున్నారు ఆయన.ఆనందయ్య ఇచ్చే మందుకోసం
ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు..కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు ఏపీ సర్కారు తెలిపింది..శుక్రవారం ఉదయం నుంచి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా లేనివారికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ.. మందు పంపిణీ చేపట్టనున్నారు..