ప్రముఖ పుణ్యక్షేత్రం అయోధ్య పాలక మండలి లో చిన్న మార్పు జరిగినది. కొత్త ట్రస్టీ గా మాజీ బ్యూరోక్రాట్ కృష్ణ మోహన్ నియమితులయ్యారు.
కృష్ణ మోహన్ స్వస్థలం యూపీలోని హర్దోయ్ జిల్లా.
ట్రస్ట్ అధ్యక్షులు మహంత్ నృత్య గోపాల్ దాస్ అధ్యక్షతన తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశం జరిగింది. మొత్తం 15 మంది ట్రస్టీలు వుండగా, ఇందులో తొమ్మిది మంది హాజరవ్వగా, మరో ముగ్గురు ఆన్ లైన్ మాధ్యమంగా పాల్గొన్నారు.1970లలో లక్నో విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ పట్టా పొందిన కృష్ణ మోహన్, మహారాష్ట్రలోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో పనిచేశారు. పదవీ విరమణ చేసినప్పటి నుండి, ఆయన సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారు.
బైఠక్ తర్వాత.. ఈ వివరాలను ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. శ్రీ రామ మందిర ప్రాజెక్టులో పాల్గొంటున్న నిర్మాణ సంస్థల పదవీ కాలాన్ని మార్చి 2026 వరకు పొడగించినట్లు ప్రకటించారు.ప్రస్తుతం, మందిరాల సరిహద్దు గోడ నిర్మాణంలో ఉంది మరియు అంతర్జాతీయ రామ కథ మ్యూజియంపై సివిల్ పనులు పురోగతిలో ఉన్నాయి. సివిల్ పనులు పూర్తయిన తర్వాత, ప్రదర్శన సంస్థాపనలు ప్రారంభమవుతాయి. అధునాతన వీడియో ప్రొజెక్షన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ మ్యూజియం భగవాన్ శ్రీరాముడి జీవితం గురించి తెలుపుతుంది.
కొత్త ట్రస్టీగా కృష్ణ మోహన్ నియమితులయ్యారని చంపత్ రాయ్ ప్రకటించారు. 70వ దశకంలో లక్నో విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆయన అణుశక్తి రంగంలో ఐదు సంవత్సరాలు పనిచేశారని తెలిపారు.ఆయన మహారాష్ట్ర కేడర్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఎంపికయ్యారు. 2012లో పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు.