భారతదేశంలో COVID-19 టీకా డ్రైవ్ లో భాగంగా ఇవాళ్టి నుంచి 12-14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు టీకాలు వేస్తున్నారు. బూస్టర్ డోస్ కు అర్హులైన అందరూ తీసుకోవాలని మోదీ సైతం కోరారు. హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్-E’ తయారు చేసిన “కార్బెవాక్స్” వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్ల వయసు పిల్లలకు బుధవారం నుంచి అందిస్తున్నారు.
“మన పౌరులందరికీ టీకాలు వేయడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు. ఇప్పుటి నుంచి 12-14 ఏళ్ల వయసు గల యువకులు టీకాలకు అర్హులు, అలాగే 60 ఏళ్లు పైబడిన వారందరూ ముందు జాగ్రత్త మోతాదులకు అర్హులు. ఈ వయసుల వారందరూ టీకాలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. మొత్తం విశ్వం పట్ల శ్రద్ధ వహించే భారతదేశతత్వానికి అనుగుణంగా వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద మేము అనేక దేశాలకు వ్యాక్సిన్లను పంపాము. భారతదేశ టీకా ప్రయత్నాలు COVID-19కి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటాన్ని మరింత పటిష్టం చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. నేడు భారతదేశంలో అనేక ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్లు ఉన్నాయి. మూల్యాంకనం ద్వారా నిర్ణీత ప్రక్రియ తర్వాత మేము ఇతర వ్యాక్సిన్లకు కూడా అనుమతిని మంజూరు చేసాము. ఈ ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కోవడానికి మనం చాలా మెరుగైన స్థితిలో ఉన్నాము. అదే సమయంలో మనం అన్ని కోవిడ్ సంబంధిత జాగ్రత్తలను పాటిస్తూనే ఉండాలని” అని మోదీ ట్వీట్ చేశారు.
https://twitter.com/narendramodi/status/1503949505699336197?s=20&t=XfhaiRL9JSH5KVLhR6hrtw
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)