మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజగోపాల్‌రెడ్డి ఈరోజు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి స్పీకర్‌ను కోరారు. దీంతో రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించారు. రాజీనామా సమర్పించిన కొన్ని నిమిషాలకే స్పీకర్ ఆమోదం తెలిపారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. అనంతరం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసేందుకు రాజగోపాల్ రెడ్డి అపాయింట్మెంట్ కోరారు. త్వరలో బీజేపీలో చేరనున్న ఆయన.. కమలం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలో దిగనున్నారు. ఆయనకు పోటీగా కాంగ్రెస్, టీఆర్ఎస్ల నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. 2018 డిసెంబర్ లో మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే.