కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కరోనా పాజిటివ్. స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో వైద్యుల సూచనమేరకు ఐసోలేషన్లో ఉన్నారు. కొన్నిరోజులుగా తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కేంద్రమంత్రి కోరారు.
అటు హైదరాబాద్ సహా జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నగరంలో కరోనా హాట్ స్పాట్స్ దడ పుట్టిస్తున్నాయి. బోరబండ, అమీర్ పేట్, హఫీజ్ పేట్, బంజారా హిల్స్, గోల్కొండ, చింతల్ బస్తీ, ఎర్రగడ్డలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 106 టెస్టింగ్ సెంటర్ల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు.
అటు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. కరోనా లక్షణాలున్నవారికి మెడికల్ కిట్ అందజేస్తామన్నారు.