పీఠమెక్కింది మొదలు పంజాబ్ సీఎం భగవంతమాన్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అందులో భగవంత్ మాన్ బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ తో మాట్లాడుతుండగా ఆమె మాస్క్ ధరించారు.
అయితే భగవంత్ మాన్ మద్యం తాగి ఉన్నాడని… మాట్లాడుతుంటే అతనినుంచి వాసన వస్తుండడంతో ఆమె ముసుగు ధరించినట్టు నెటిజన్ ఆరోపించారు. గత నెలలో చండీగడ్ విమానాశ్రయం పేరు మార్చేకార్యక్రమంలో ఇద్దరూ వేదిక పంచుకున్నారు. అందులో మాన్ తనతో మాట్లాడుతుంటే… ఆమె వింటూనే ముసుగుధరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాస్క్ వేసుకుంటూమాన్ ను తాను అసహ్యించుకున్నట్టు ఆ వీడియోలో ఉంది. దీంతో మాన్ నుంచి వచ్చే ఆల్కహాల్ స్మెల్ తట్టుకోలేకే మధ్యలో ముక్కు మూసుకుందని అనుకున్నారంతా… కారణం భగవంత్ మాన్ గతంలో తాగి దొరికిపోయారు.
దీంతో ఈ వీడియో చూసి మాన్ ను విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజన్లు. పంజాబ్ సీఎం మద్యపానసేవనం ఆప్ ప్రతిష్టను దిగజారుస్తోందని …ఈసారి అలాగే పరువు తీశాడండూ ఓ ట్విటర్ వినియోగదారు ట్వీట్ చేశారు. ఆ వీడియోను అందుకు జతచేశారు.
What did you smell Kirron Kher mam? 🤣 pic.twitter.com/YvegES2rcN
— Chakradhar Sarangi (@cdsmumbai2022) October 3, 2022
అయితే ఈ వివాదంపై కిరణ్ ట్విట్టర్లోనే స్పందించారు. అమృత్ మాన్ పాడిన ‘పెగ్ డి వాష్నా’ పాటతో ఉన్న వైరల్ వీడియోను అప్లోడ్ చేస్తూ వివరణ ఇచ్చారు. నేను ఓ బహిరంగ సభలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జీతో మాట్లాడుతున్నప్పుడు మాస్క్ వేసుకున్న వీడియో వైరల్ కావడం దురదృష్టకరమని అన్నారు. తనకు ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లే అలా చేస్తానని… దయచేసి ఆయన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు. ఏ పార్టీ వారైనా…వారి పదవికి గౌరవాన్ని ఇవ్వాలని ఆమె అన్నారు.
2021లో కిరోన్ ఖేర్‌కు మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అందుకు ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 2021 నవంబర్‌లో జరిగిన ఇండియా గాట్ టాలెంట్ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ఆమె… అప్పుడూ ఫేస్ మాస్త్ ధరించేవచ్చారు. బయట ఎక్కువగా తిరగవద్దని వైద్యులు సూచించారని..కానీ ఓ ఎంపీగా జనం ముందుకు వెళ్లకతప్పడం లేదని…అందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని ఆమె స్పష్టంచేశారు.