రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ ను చంపాలని పిలుపునిచ్చారు అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం.
రష్యా సైన్యంలో బ్రూటస్ కానీ, కల్నల్ స్టౌఫెన్ బర్గ్ కానీ ఉన్నారా అని ప్రశ్నించిన ఆ రిపబ్లికన్…. పుతిన్ చంపేస్తే ప్రపంచానికి మేలు చేసినట్టు అవుతుందన్నారు. రష్యాలోనే ఎవరో ఒకరు ముందుకొచ్చి పుతిన్ ను మట్టుపెట్టాలంటూ వరుసట్వీట్లు చేశారు. రష్యన్లు మాత్రమే ఆ పనిచేయగలరంటూ జూలియస్ సీజర్ ను చంపిన బ్రూటస్ నుగుర్తు చేశారు.అలాగే హిట్లను హత్యచేయాలని చూసిన స్టౌఫెన్ బర్గ్ పేరునూ ప్రస్తావించారు. అమెరికా మాజీ అధ్యక్షుడైన ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు లిండ్సే.