రాహుల్ కు జైలు శిక్ష నేపథ్యంలో బీజేపీ నాయకురాలు ఖుష్బు గతంలో చేసిన ఓ ట్వీట్ ను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. అందులో ఖుష్బూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 2018లో నాడు అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె… మోదీ సర్కారుపై విమర్శలు చేస్తూ… నీరవ్ మోదీ, లలిత్ మోదీ కుంభకోణాలు ప్రస్తావిస్తూ… మోదీ అంటే అర్థం అవినీతి అని మార్చాలని విమర్శించారు. ఇంచుమించు అలాంటి ఆరోపణలే చేసిన రాహుల్ కు సూరత్ కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ మద్దతుదారులు ఆ ట్వీట్ ను ఇప్పుడు వైరల్ చేస్తూ ఖుష్బూమీద కూడా కేసు పెడతారా అని ట్రోల్ చేస్తున్నారు.
BJP leader Khushbu Sundar literally said all corrupt have Modi surname…
Will she be charged & convicted? pic.twitter.com/I22vH3xkkM
— Spirit of Congress✋ (@SpiritOfCongres) March 24, 2023