రాజకీయాల్లో కులం మతం ప్రాంతం సమీకరణాలు బాగా పనిచేస్తాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ కొత్త స్కెచ్ వేస్తోంది. వాయనాడ్ ప్రాంతంలో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగుతున్నారు. ఆమె మీద పోటీ గా ప్రముఖ నటి ఖుష్బూ ని రంగంలోకి దించాలని భావిస్తున్నారు.
కేరళ లోని వాయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ వాయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీని బరిలో దించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రియాంకాగాంధీపై నటి కుష్బూ సుందర్‌ను బరిలో దించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ నటి ఖుష్బూ తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందినవారు. వాయనాడ్ లో ముస్లిం ఓటింగ్ అత్యధికం. ఖుష్బూ జన్మతహా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో కులం, మతం, ప్రాంతం లెక్కలలో ఆమె ముందు ఉంటారు. ప్రియాంక నాన్ లోకల్, పైగా ఈ ప్రాంతానికి బాగా కొత్త.
దీనిపై కుష్బూ సుందర్ స్పందిస్తూ . ఎన్నికల వేళ ఇలాంటి పుకార్లు వస్తూనే ఉంటాయని, ఇది కూడా పుకారే అని చెప్పారు. అయితే ఒకవేళ పార్టీ ఆదేశిస్తే తాను ప్రియాంకాగాంధీపై పోటీ చేయడానికి సిద్ధమేనని ఆమె స్పష్టం చేశారు.
కాగా వాయనాడ్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుంది. ఎందుకంటే అక్కడి నుంచి కమ్యూనిస్టు పార్టీ కూడా బలమైన అభ్యర్థిని బరిలో దించింది. తమ అభ్యర్థి సత్యన్ మొఖేరీ బరిలో దిగుతారని ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. కాగా వాయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తారు.
రాహుల్ గాంధీ రాజీనామా తో అక్కడ ఉప ఎన్నిక అవసరం అవుతోంది.