హిందుత్వను ఇస్లాం ఉగ్రవాద జిహాదీలతో పోలుస్తూ కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘Sunrise Over Ayodhya: Nationhood in Our Times’ పై నిషేధం విధించాలని హిందూసేన డిమాండ్ చేసింది. ఈమేరకు కేంద్రహోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ గర్నర్ అనిల్ బైజల్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు హిందూసేన అధ్యక్షుడు విష్టుగుప్తా లేఖరాశారు. హిందుమతాన్ని దుర్మార్గంగా చిత్రీకరిస్తూ ఖుర్షీద్ రాతలున్నాయని మండిపడ్డారు.
ఖుర్షీద్ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. హిందుత్వను ఉగ్రవాద సంస్థలు ఐసిస్, బోకోహరాంతో పోల్చడం ద్వారా పుస్తకానికి ప్రచారం కల్పించుకోవాలనుకుంటున్నారని…కానీ పబ్లిసిటీ అటుంచి సామాజిక సమగ్రతను దెబ్బతీస్తుందని…ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అందువల్ల పుస్తక ప్రచురణను ఆపేయాలని..అమ్మకాలను నిషేధించాలని …అలాగే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
‘The Saffron Sky’ అనే శీర్షికతో “సనాతన ధర్మం, ఋషులు, సాధువులకు తెలిసిన సాంప్రదాయ హిందూమతం…బలమైన సంస్కరణలతో పక్కకు నెట్టివేయబడుతోంది. ఇస్లాం ఉగ్రగ్రూపులైన ఐసిస్, బోకోహరాం మాదిరిగానే హిందుత్వ మారిపోయింది”అని ఖుర్షీద్ తన పుస్తకంలో రాశారు.