జమ్ముకశ్మీర్లో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 3వ ఎడిషన్ ఘనంగా జరుగుతోంది. కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈవెంట్ ను ప్రారంభించారు. బారాముల్లా జిల్లాలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ గుల్మార్గ్ లో ఈమెగా స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతోంది. సుందరమైన కశ్మీరంలో…మంచుతో కప్పబడిన శిఖరాల్లో జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోందని ఠాకూర్ అన్నారు. దేశవ్యాప్తంగా 1500 మందికి పైగా అథ్లెట్లు ఈ నేషనల్ ఈవెంట్లో పాల్గొంటున్నారు.