అత్యాధునిక హంగులతో 25 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఖమ్మం బస్టాండ్ హఠాత్తుగా కూలింది. ఈ బస్టాండ్ నిర్మాణ పనులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. నిర్మాణం పూర్తయిన వెంటనే… పంచాయతీ రాజ్ మంత్రి కేటీఆర్ ఏప్రిల్ 4న ప్రారంభించారు. ప్రారంభమై నెలదాటింది అంతే. ఇప్పుడది క్రమంగా కూలుతోంది. ముందుగా సీలింగ్ ఊడిపడింది. కరోనా, లాక్ డౌన్ కారణంలో ప్రయాణీకులు ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బస్టాండ్ మొదలైన నెలకే ఇలా జరగడంపై స్థానికులు అవాక్కయ్యారు. నాణ్యత లేకుండా నిర్మించి ఎవర్ని ప్రాణాలు బలిగొనాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.