ఆస్ట్రేలియా మెల్బోర్న్లో ఉగ్రవాది జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలే చిత్రాలను పోస్టర్ లపై, బిల్బోర్డ్ లపై చూసి భారతీయులు ఆశ్చర్యపోయారు. ఖలిస్తాన్ డే సందర్భంగా ఈ పోస్టర్లు వెలిశాయి. ది ఆస్ట్రేలియా టుడే నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలోని చాలా మంది భారతీయులు, ముఖ్యంగా హిందువులు విక్టోరియా పోలీసులకు, అలాగే స్థానిక కౌన్సిల్ అధికారులకు ఫోన్ చేసి తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని కీర్తిస్తున్న ఆ బిల్‌బోర్డ్‌ల గురించి ఫిర్యాదు చేశారు.
మీడియా కంపెనీ “సివిక్ అవుట్డోర్” కు సంబంధించినవే ఈ బిల్‌బోర్డ్‌లు. ఆ పోస్టర్‌ను తొలగించాలని ఆస్ట్రేలియాలోని భారతీయులు కంపెనీకి కూడా మెయిల్ చేశారు.
సివిక్ అవుట్డోర్ CEOకి వ్రాసిన మెయిల్లో… “మేం మెల్బోర్న్లోని రింగ్ రోడ్లో మీ కంపెనీకి సంబంధించిన డిజిటల్ అడ్వర్టైజింగ్ బిల్‌బోర్డ్‌పై తీవ్రవాది చిత్రం, “ఖలిస్తాన్ డే” పదాలను చూశాం. క్రేగీబర్న్ సిక్కు గురుద్వారాలో ఖలిస్తాన్ డే ఈవెంట్ గురించి కొన్ని వివరాలు కూడా ప్రకటనలో ఉన్నాయి. అటువంటి ప్రకటనలను ప్రదర్శించడం తగనిది, అతివాద అభిప్రాయాలకు ప్రత్యేక వేదికను కూడా ఇస్తుంది. మీకు తెలియదేమో.. ఖలిస్తాన్ ఉద్యమం అనేది దాని మద్దతుదారుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని సృష్టించాలని కోరుతూ తీవ్రవాదాన్ని ప్రేరేపించే ఉద్యమం’అని మెయిల్ చేశారు.
“బిల్‌బోర్డ్‌లో ‘జమైల్ సింగ్ బింద్రన్‌వాలే’ అనే వ్యక్తి చిత్రం ఉంది, అతన్ని భారత ప్రభుత్వం మాత్రమే కాకుండా విదేశీ ప్రభుత్వాలు, అనేక అంతర్జాతీయ ఏజెన్సీలు ఉగ్రవాదిగా గుర్తించాయి.
బింద్రన్‌వాలే భారత రిపబ్లిక్కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉగ్రవాదానికి ఆజ్యంపోశాడని పేర్కొన్నారు.
భారతదేశాన్ని విభజించి ఖలిస్తాన్‌ను సృష్టించాలని వేర్పాటువాదులు విక్టోరియాలో బలంగా పనిచేస్తున్నారని ఇటువంటి ప్రదర్శనలు దురదృష్టవశాత్తూ మీ కంపెనీ ఈ ప్రకటన ద్వారా వాటిని ప్రోత్సహిస్తోందనీ గుర్తుచేశారు.
అంతేకాకుండా, ఈ చర్యలు శాంతియుత ఆస్ట్రేలియాకు, ఇక్కడ నివసిస్తున్న భారతీయులందరికీ ఇబ్బంది కలిగిస్తాయన్నారు. జాతీయ భద్రతకు ప్రమాదాన్ని కలిగిస్తాయి.
ఈ సిక్కు దేవాలయం ఇటువంటి సంఘటనలలో పాల్గొనడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరి 19-20తేదీల్లో ప్రాంగణంలో హిందూ-వ్యతిరేక, భారతదేశ-వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల బ్యానర్లు ప్రదర్శించారు. తరువాత స్థానిక కౌన్సిల్, పోలీసులు సహా అధికారుల జోక్యంతో వాటిని తొలగించారు. శాంతియుత విక్టోరియా, బహుళ సాంస్కృతిక ఆస్ట్రేలియాలో మతపరమైన ఉద్రిక్తతలకు ఆజ్యం పోసే అటువంటి సమూహాలను… వారి ప్రతినిధులను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అక్కడి భారతీయులు మండిపడ్డారు.
Bhindranwale billboard was seen in Melbourne, Aus. Amar Singh of Turban 4 Australia, a Khalistani group, was awarded Citizen of the Year, Federal MP Alex Hawke tweeted in support of Khalistanis. GOI should make this an issue before any FTA's are signed.@DrSJaishankar @MEAIndia pic.twitter.com/SdlSOMMMaG
— Stop Hindu Hate Advocacy Network (SHHAN) (@HinduHate) April 27, 2022
‘డిజిటల్ ప్రకటనను వెంటనే నిలిపివేయాలని, భవిష్యత్తులో అలాంటి ప్రకటనలు ప్రదర్శించకుండా చూసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం” అని వాళ్లు కంపెనీకి కంప్లైంట్ చేశారు.
మొత్తం ఇండియా-ఆస్ట్రేలియన్ కమ్యూనిటీని తీవ్రంగా ఆగ్రహానికి గురి చేస్తున్నందున బిల్‌బోర్డ్‌ను తీసివేయమని కంపెనీ యాజమాన్యానికి వందలాది ఇమెయిల్‌లు వచ్చాయి. ఆగ్రహజ్వాల ఫలితంగా ఆ పోస్టర్, అలాగే బిల్ బోర్డుపై ఉన్న ఉగ్రవాది బింద్రన్‌వాలే చిత్రాన్ని తొలగించారు.