సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ లిబరల్ కాలమిస్ట్ ఖలాఫ్ అల్ హర్బి భారతదేశాన్ని స్పృశిస్తూ రాసిన ఆర్టికల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత్ ను ఎంతో గొప్పగా కొనియాడుతూ ఆయన రాసిన రాతలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
‘సౌదీ గెజిట్ ‘ కోసం తాజాగా రాసిన వ్యాసంలో ‘ఈ భూమండలంలో అత్యంత సహనశీల దేశం భారతే’ అని అభివర్ణించాడు. ఆర్టికల్ కు హెడ్డింగ్… ‘భారతదేశం – ఏనుగులపై సవారీ చేసే దేశం’
ఖలాఫ్ హర్బీ ఇంకా ఏమని రాశారంటే…’భారత్ లో 100కు మించి మతాలున్నాయి. 100 కన్నా ఎక్కువే భాషలూ ఉన్నాయి. అయినప్పటికీ ఆ దేశ ప్రజలు శాంతి సామరస్యాలతో జీవిస్తున్నారు. సూది మొదలు అంగారక గ్రహానికి పంపే రాకెట్ వరకు ప్రతిదీ ఉత్పత్తి చేయగల ఆధినిక భారతదేశనిర్మాణం కోసం వారంతా చేతులు కలిపారు. ఎందుకో భారత్ ను తలుచుకుంటే నాకు చాలా ఈర్శ్యగా ఉంది. ఓకే మతం, ఒకే భాష కలిగిన ప్రాంతంనాది. అయినా ప్రతీచోటా హత్యలు, అరాచకాలు. అందుకే ప్రశాంతంగా, సహనశీలగా ఉన్న ఇండియా గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తోంది. ప్రపంచం ఇండియాను చూసి ఎంతో నేర్చుకోవాలి. సామాజిక,మత, రాజకీయ, జాతిబేధాలు లేకుండా సహనం, శాంతియుత జీవనాన్ని ప్రపంచానికి బోధిస్తున్న పురాతన, ముఖ్య పాఠశాల భారతదేశం అని కొనియాడారు ఖలాఫ్.