యూపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధించింది. ఈ క్రమంలోనే లక్నోలోని షాహీ ఇమామ్ ఇ జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగే సామూహిక ప్రార్థనలను నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ప్రార్ధనలు నిలిపివేయనున్నట్లు మౌలానా కల్బే నక్వీ పేరిట ఓ కరపత్రిక విడుదలైంది.‘‘అసీఫీ మసీదులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు శుక్రవారం ప్రార్థనలను నిలిపివేస్తూ.. ఇమామ్-ఇ-జుమా మౌలానా కల్బే జవాద్ నక్వీ నిర్ణయం తీసుకున్నారు…’’ అని ఆ కరపత్రంలో పేర్కొన్నారు..