ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలైను మకర విళక్క్ సీజన్ సందర్భంగా లక్షల మంది భక్తులు సందర్శిస్తారు.
40 రోజులపాటు దీక్ష చేసి ప్రత్యక్షతలతో భక్తిశ్రద్ధలతో ఇరుముడి కట్టుకుని, శబరిమలై వెళ్లే భక్తుల కు .. అక్కడ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శబరిమలైలో పూజల సమయాలు, వసతి సౌకర్యాలు, స్పెషల్ బస్సులు అంటే వివరాలు పెద్దగా తెలియవు. దీంతో గుంపులుగా అక్కడకు చేరుకున్న యాత్రలు ఇబ్బంది పడుతుండేవారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలై వెళుతుంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే శబరిమలై క్షేత్రంలో మలయాళం భక్తుల తర్వాత ఎక్కువ సంఖ్యలో తెలుగు స్వాములే కనిపిస్తూ ఉంటారు. శబరిమలై తో తెలుగు భక్తులకు ఆ స్థాయిలో అనుబంధం కనిపిస్తుంది.
కానీ, శబరిమలై యాత్ర మీద సమగ్రమైన సమాచారం దొరక్క ఇబ్బంది పడుతుంటారు.
ఈ సమస్య తీర్చేందుకు కేరళ ప్రభుత్వం కొత్త చొరవ తీసుకోంది. ఆధునిక టెక్నాలజీని మేళవిస్తూ చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వామి పేరుతో రూపొందించిన ఈ చాట్ బాట్ లో శబరిమలై యాత్రకు సంబంధించిన సమాచారం స్పష్టంగా కనిపిస్తుంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తాజాగా ఈ చాట్ బాట్ లోగోని ఆవిష్కరించారు. హిందీ, ఇంగ్లీషు, మలయాళం భాషలతో పాటు దక్షిణాది భాషలైన తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సమాచారం లభిస్తుంది. అయ్యప్ప స్వామే స్వయంగా వివరాలు అందిస్తున్నట్లుగా కనిపించడం ఈ చాట్ బాట్ ప్రత్యేకత.
శబరిమలై సన్నిధానంలో పూజలు, అర్చనలు , ఇరుముడి సమర్పణ తదితర వివరాలతో పాటుగా దర్శనం వేళలు వంటి సమాచారం అందిస్తారు. శబరిమలై వెళ్లేందుకు అవసరమైన బస్సు, రైలు మార్గాల సమాచారాన్ని, కాలినడక దారిలో సేవల కోసం పోలీసు అధికారులు, అటవీ అధికారుల వివరాలు కూడా అందిస్తూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాల భక్తులకు తిరుగు ప్రయాణం కు సంబంధించిన సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.
మరోవైపు యాత్రికుల అవసరాలు కోసం కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సేవలను ప్రారంభించింది.
శబరిమలై కాలినడక సమయంలో ఆకస్మిక వర్షాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎప్పుడు వాన ముంచుకొస్తుంది అనేది తెలియకపోవడంతో చాలాసార్లు భక్తులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని వర్షం వంటి వాతావరణ మార్పుల గురించి అప్రమత్తం చేసేందుకు భారత వాతావరణ విభాగం ఈ ఏడాది మూడు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాగల రోజుల్లో వర్ష సూచన గురించి ముందుగానే అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పుడు అంత స్మార్ట్ ఫోన్లు విపరీతంగా వాడుతున్నారు కాబట్టి,, ఇటువంటి సౌకర్యాలు తీసుకుని వచ్చినట్లయితే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.