కేరళలో స్వయంసేవకుల హత్యాకాండ ఆగడం లేదు. పాలక్కాడ్ లో మరో ఆర్ఎస్ఎస్ కార్యకర్తను దారుణంగా నరికి చంపారు దుండగులు. పట్టణంలో చిన్న షాపు నిర్వహించుకునే శ్రీనివాస్ పై దాడి చేసి విచక్షణారహితంగా చంపేశారు. మోటార్ బైకుపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతనిపై ఆయుధాలతో దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాసన్ ను అక్కడివారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. దార్లోనే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. శ్రీనివాసన్ హత్య వెనుక సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉందని రాష్ట్ర బీజేపీ ఆరోపిస్తోంది.