కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార ఎల్డీఎఫ్ మరోసారి అధికారం చేపట్టేందుకు తీవ్ర ప్రయాత్నాలు చేస్తున్నప్పటికీ.. బీజేపీ కూడా ఈ సారి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మ్యానిఫెస్టోను రెడీ చేశారు. అంతేకాదు కేరళ ప్రజల మనోభావాలను పరిగణలోనికి తీసుకుని శబరిమల అంశాన్ని కూడా మ్యానిఫెస్టోలో పెట్టారు. శబరిమల అయ్యప్ప కోసం ప్రత్యేక చట్టాన్ని చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ విషయాన్ని ఎన్డీయే మ్యానిఫెస్టోలో కూడా పేర్కొంది. బుధవారం నాడు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. కేరళ సంపూర్ణ అభివృద్ధిపై బీజేపీ మ్యానిఫెస్టో దృష్టిసారించిందని.. ఉద్యోగాల కల్పన, శబరిమల, లవ్ జిహాద్‌పై ప్రత్యేక చట్టం, హైస్కూల్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు వంటి హామీలను కూడా మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.