రైతులకు మద్దతుగానంటూ అధికార టీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీలో దీక్షకు దిగితే…ప్రతిపక్ష బీజేపీ హైదరాబాద్ లో దీక్ష చేపట్టింది. ‘‘కేసీఆర్ వడ్లు కొను.. లేదా గద్దె దిగు’’ ఇందిరాపార్క్ దగ్గర నేతలు దీక్ష ప్రారంభించారు. ఈటల రాజేందర్, డీకేఅరుణ, మురళీధర్ రావు ఉదయం దీక్షను ప్రారంభించగా..పార్టీ అధ్యక్షుడు సంజయ్ నాంపల్లి కోర్టు కేసు నేపథ్యంలో కాస్త ఆలస్యంగా దీక్షలో పాల్గొన్నారు.
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అన్నదాత అడ్డుపెట్టుకుని కేసీఆర్ అవకాశవాద రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు సంజయ్. ఇక్కడ ఏం చేయలేక ఢిల్లీకి వెళ్లారని…ఆయన దొంగ దీక్షను ప్రజలెవరూ నమ్మబోరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకూ కేసీఆర్ ను వదిలిపెట్టబోమని పార్టీ నాయకులు ఈటల, మురళీధర్ రావు, రఘునందన్ రావు అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)