తమ కులస్తులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముదిరాజ్ లు మండిపడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వారి ఆందోళనలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో పెద్దసంఖ్యలో ముదిరాజ్ లు రోడ్డెక్కారు. తమను అవమానిస్తూ..
అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కథలాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో … ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
కౌశిక్ రెడ్డి మొదటినుంచి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర గవర్నర్ ను సైతం ఆయన కించపరిచేలా మాట్లాడారని, తమకు పెద్దదిక్కుగా ఉన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై, మొత్తం ముదిరాజ్ కులస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.