కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. గిలానీ కొంతకారంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి శ్రీనగర్లో తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. గురువారం తెల్లవారుజామునే అంత్యక్రియలు కూడా పూర్తిచేసినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మూడుదశాబ్దాలపాటు కశ్మీర్ వేర్పాటువాద నాయకుడిగా గిలానీ కొనసాగాడు. గిలానీ మృతితో కశ్మీర్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.