కాశ్మీరీ పండిట్ నర్సు సరళ భట్ హత్య కేసు 35 ఏళ్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. పోలీసు ప్రత్యేక దర్యాప్తు సంస్థ శ్రీనగర్లో ఎనిమిది ప్రదేశాల్లో సోదాలు జరిపింది. ఈ కేసు మళ్లీ తెరుచుకోవడం కాశ్మీరీ పండితుల గాయాలను మళ్లీ గుర్తు చేస్తోంది.
……
27 ఏళ్ల సరళ భట్ కాశ్మీర్ అల్లర్ల సమయంలో ధైర్యంగా నర్సుగా సేవలు అందించారు. 1990 ఏప్రిల్లో ఆమెను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు మూకుమ్మడిగా అత్యాచారం చేశారు. శరీరం అంతా వార్తలు పెట్టి దారుణంగా హత్య చేశారు. మతం మారకుండా హిందువుగా కొనసాగడమే ఆమె చేసిన ఏకైక పాపం.
…………
ఆ కాలంలో ఉగ్రవాదులు కాశ్మీరీ హిందువుల మీద విపరీతంగా దాడులు చేశారు. రాత్రిపూట “మతం మార్చుకో, చచ్చిపో, లేక వలస వెళ్ళిపో” అనే నినాదాలతో ప్రజలను భయపెట్టారు.
…….
మహిళలే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యం అయ్యారు. నీలమటా గ్రామానికి చెందిన గిరిజా టిక్కూ అనే యువతి రైల్వే ఉద్యోగి. ఆమెను కేవలం హిందువు అనే కారణంతో కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేసి, సజీవంగా చెక్క కటింగ్ యంత్రంలో నరికివేశారు. వందలాది ఇలాంటి దారుణాలు చోటుచేసుకున్నాయి.
అనేక గ్రామాలలో హిందువుల ఇళ్లను తగలబెట్టి, దేవాలయాలను ధ్వంసం చేశారు. వేల కుటుంబాలు తమ ఇళ్లు, పొలాలు, ఆస్తులు వదిలి శరణార్థులుగా జమ్మూ, ఢిల్లీ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ దాడులు పాకిస్తాన్ ప్రోత్సాహంతో నడిచాయి. స్థానిక మద్దతుతో, కాశ్మీర్ లోని హిందువులను పూర్తిగా తరిమేయాలనే లక్ష్యంతో ఇవి జరిగాయి.
………
ఈ కాశ్మీర్ ఫైల్స్ మీద లోతుగా దర్యాప్తు జరగాలని డిమాండ్ బలంగా ఉంది. తాజాగా
సరళ భట్ హత్య కేసు మళ్లీ తెరవడం కేవలం ఒక వ్యక్తి కోసం న్యాయం సాధించడం మాత్రమే కాదు. ఇది ఆ కాలంలో న్యాయం పొందని వేలాది బాధితులకు ఆశనిచ్చే విషయం. కాశ్మీరీ పండితుల గాయాలు ఇంకా మానిపోలేదు. కానీ ఈ దర్యాప్తు, కనీసం చరిత్రలోని నిజాలను వెలుగులోకి తెస్తుందని ఆశిద్దాం.