కశ్మీర్ లోయలో హిందువుల మారణహోమంపై సినిమా తీయడమంటే తామెంతో ధైర్యం చేసినట్టని ది కశ్మీర్లో ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి అన్నారు. తీవ్రవాదానికి అందరూ భయపడ్డారని మేం మాత్రం ముందుకు వెళ్లామని అన్నారు. ‘షిండ్లర్స్ లిస్ట్’ సినిమాను రూపొందించినప్పుడు.. ప్రపంచం మెచ్చుకుంది.. అయితే నాజీలు పరిపాలిస్తున్నప్పుడు షిండ్లర్స్ లిస్ట్ ను రూపొందించడాన్ని ఊహించుకోండి. అలాగే ప్రస్తుతం ఉగ్రవాదం రాజ్యమేలుతోందని.. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా తీయడంఅంటే తామెంతో సాహసం చేసినట్టేనని అన్నారు.