కశ్మీర్ హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన ది కశ్మీర్ ఫైల్ ఇంకా చర్చల్లో ఉంది. సినిమాను చాలామంది ఆదరించగా…కొందరు అది రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా “కశ్మీర్ ఫైల్స్ దాదాపు కల్పిత వెర్షన్’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే సినిమాను ప్రమోట్ చేస్తోందని ఆరోపణగా అన్నారు.
కాగా, షా ప్రకటనపై చిత్ర నిర్మాత వివేక్ అగ్నిహోత్రి స్పందించారు.ఆయన ఇంటర్వ్యూ నుంచి షా మాట్లాడిన వీడియోను ట్వీట్ చేసి, “నేను దీనితో అంగీకరిస్తున్నా. మీ సొంత దేశంలో కశ్మీరీ హిందూ మారణహోమం గురించి మాట్లాడితే మీరు నిజంగా దుర్భాషలకు, శిక్షలకు గురవుతారు మరి అని ట్వీట్ చేశారు.
I agree with this.
You are indeed abused and penalised for talking about Kashmiri Hindu Genocide in your own country. pic.twitter.com/sU4lePOfe0— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) June 8, 2022