………………………………………….
తమిళనాడు వ్యవహారాల మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన సంచలనంగా మారింది. హైందవ భావజాలాన్ని సమర్థించినందుకు హైకోర్టు మీద స్టాలిన్ ప్రభుత్వం తిరుగుబాటు చేస్తోంది. దీనిని ఖండిస్తూ పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. కార్తీక దీపోత్సవం శతాబ్దాల నుంచి ఉన్న సాంప్రదాయం అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి పవిత్ర సంప్రదాయాలపై రాజకీయ జోక్యాలు చేయడం సరి కాదని వ్యాఖ్యానించారు. భక్తుల భావాలను గౌరవించి, న్యాయవ్యవస్థ ఆదేశాలను పాటించడం ప్రభుత్వ ధర్మమని ఆయన అన్నారు.
………………………………………
అసలు ఈ గొడవ వివరాలు చూస్తే….
తిరుప్పరంకుండ్రం సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం శతాబ్దాల నాటి సంప్రదాయం. ఈ ఆలయం పక్కనే ఉన్న కొండపై పాండ్య రాజుల కాలానికి చెందిన పురాతన దీపస్తంభం ఉంది. దాదాపు 18 వందల సంవత్సరాలుగా అక్కడే దీపోత్సవం నిర్వహిస్తున్నారు. కానీ కొంత కాలం క్రితం అక్కడ ఒక దర్గా వెలిసింది. దీంతో అక్కడ దీపోత్సవాన్ని సెక్యులర్ ప్రభుత్వాలు నిలిపివేశాయి. వందేళ్లుగా కొండ దిగువన ఉన్న స్తంభంపై దీపం వెలిగిస్తున్నారు. అసలైన పురాతన స్తంభంపైన దీపం వెలిగించేందుకు కొంతమంది భక్తులు కోర్టును ఆశ్రయించారు. కానీ అక్కడ మత ఘర్షణలు తలెత్తవచ్చని డీఎంకే ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత.. కొండపైని పురాతన స్తంభంపై దీపోత్సవం జరుపుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
………………..
దీనిని స్టాలిన్ ప్రభుత్వం ఏమాత్రం అమలు చేయలేదు. సరికదా, ఈ వ్యవహారంపై డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇదే సమయంలో న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం తీసుకొని రావాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. అంటే హైందవుల సాంప్రదాయాలు అంటే స్టాలిన్ ప్రభుత్వానికి ఎంతటి ద్వేషమో అర్థం అవుతోంది.
…………………………………………..
దీని మీద సెక్యులర్ పార్టీలు ఏమాత్రం స్పందించలేదు. కానీ జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ హుందాగా స్పందించారు.
ఈ పరిణామాలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందిస్తూ, కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత విచారకరమని మండిపడ్డారు. తీర్పు నచ్చకపోతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లడం ప్రజాస్వామ్య పద్ధతి కానీ, ఒక న్యాయమూర్తిని అపఖ్యాతిపాలు చేసే ప్రయత్నం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం తీర్పును అమలు చేయకుండా కోర్టును సవాల్ చేసిన తీరు కూడా ఆయన విమర్శించారు.



