స్టార్టప్ రంగంలో కర్నాటక దూసుకెళ్తోంది. తాజా ర్యాంకింగ్ లో అత్యుత్తమ పనితీరులో గుజరాత్ ను దాటుకుని అగ్రభాగాన నిలిచింది పొరుగురాష్ట్రం. అత్యుత్తమ సాధన, కార్యనిర్వహణ, నాయకత్వం, వర్ధమాన లీడర్షిప్ తదితర అంశాలల్లో కేంద్రం ర్యాంకులు కేటాయించింది. రాష్ట్ర ఐటీబీటీ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఈవీ రమణారెడ్డి, డైరెక్టర్ మీనా నాగరాజ్ స్టార్టప్ చాంపియన్ పురస్కారాలను అందుకున్నారు. ఆవిష్కరణలకు ఊతమిస్తూ సాంకేతిక ప్రగతికి పెద్దపీట వేస్తూ జరుగుతున్న కృషికి స్టార్టప్ పురస్కారం రావడం సంతోషకరమని సీఎం అన్నారు.
ఇక దేశవ్యాప్తంగా ఆహార భద్రతాచట్టం అమలులో ఒడిశా మొదటిస్థానంలో నిలిచింది. ఈ చట్టం అమలవుతున్న రాష్ట్రాల్లో మరో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో నిలవగా..తెలంగాణ 12 వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.ఢిల్లీలో మంగళవారం జరిగిన రాష్ట్రాల ఆహార మంత్రుల సదస్సులో రాష్ట్రాలకు ర్యాంకులు ప్రకటించింది కేంద్రం.